Posted by: JayaPrakash Telangana | February 27, 2007

ప్రపంచ బ్యాంక్ ప్రెజిడెంట్ : నా దెగ్గర ఏముంది సాక్స్‌ల్లో చిల్లులు తప్ప !

paul wolfowitz hole in socksఈ మహానుభవుడు ఎవరో కాదు.. సాక్షాత్తు మన ‘ప్రపంచ బ్యాంక్ ప్రెజిడెంట్’ ‘పాల్ వుల్ఫోవిట్జ్’ ఏ !
టర్కీల ఒక మసీదుల నుంచి బైటికి వస్తుంటే తీసిన ఫొటో ఇది… మూడో ప్రపంచ దేశాలని కొల్లగొడుతున్న ‘ప్రపంచ బ్యాంక్’ అధినేత అయిన ఈయనకు ఈ గతి ఏంది ?
ఈ ఫొటో తీయ్యంగనే టర్కిష్ ప్రొడ్యూసర్లు ఉరుక్కుంట పొయ్యి ఒక జత సాక్స్ పట్టుకొచ్చిన్రంట.

(హిజాబీ మాడ్‌నెస్ సౌజన్యం)

‘పాల్ వుల్ఫోవిట్జ్’ ఆంధ్ర దేశానికి వచ్చినప్పుడు, మన పేద రైతులు ఓ దేవుడు దిగొచ్చినట్టు చూసిన్రు, ఏదో చేస్తడని…

   

ఏం చేస్తడు “చేతిల చిప్ప పెట్టుడు తప్ప”, ఆ చిప్పకూడా పున్యానికి ఇస్తడనుకున్నరా? లేదు దానికి కూడ ఇంకొంచం అప్పు ఇస్తడు.

Paul Wolfowitz in India  Paul Wolfowitz in India  Paul Wolfowitz in India

( ఫొటోలు ‘ప్రపంచ బ్యాంక్ వెబ్‌సైట్’ సౌజన్యం)


Responses

  1. నాకు నిజాం ప్రభువుని గుర్తుకు వస్తున్నాడు. ప్రజల దగ్గర గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసిన డబ్బుతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ఆయన లోపల చిరిగిన చొక్కా వేసుకుని పైన షేర్వానీ వేసుకునేవాడట…”ఊపర్ షేర్వానీ, అందర్ పరేషాని” సామెత పుట్టింది బహుశా అక్కడినుంచేనేమో!

    అయినా వీళ్లిద్దరి మధ్యా పోలిక అక్కడితో సమాప్తమవుతుందనుకో. ఎంత తిట్టుకున్నా ఈ వరల్డ్ బ్యాంక్ కన్నా ఆ నిజాం ప్రభువులే చాలా నయం.


Leave a response

Your response:

Categories