Posted by: JayaPrakash Telangana | April 2, 2007

ఇరాక్ సస్యశ్యామలం !

Sen John McCainరిపబ్లికన్ సెనెటర్ జాన్ మెకేన్ ఇరాక్‌ను సందర్శించినంక “మన అమెరికా వార్త పత్రికల్ల ఇరాక్ గురించి ఎప్పుడు సుయిసైడ్ బాంబింగులు, కిడ్నాపులు, రాకెట్ అటాక్‌లు అని, చేడు రాస్తున్నరు తప్ప అక్కడ జరుగుతున్న అభివృధ్ధికాదు. మనం ఇరాక్‌కు వచ్చిన పని పూర్తైపోయిందని నేను అనట్లేదు. యుద్ధం మొదలైన ఇన్ని రోజులకి అక్కడ కొత్తగ ఏమేమి జరుగుతున్నయో మన మీడియా ప్రస్తావిస్తలేదు. ఇప్పుడు ఇరాక్ భద్రంగా ఉన్నది అనడానికి నా ఈ పర్యటనే మంచి సాక్ష్యం, నేను బగ్దాద్ ల ఇప్పుడు పర్యటించినట్టు స్వేచ్చగ ఎన్నడూ పర్యటించలేదు” అంటూ ఇచ్చిన స్టేట్‌మెంటు దాదాపు అన్ని పత్రికల్ల మారుమోగింది.

ఒక్క విషయం తప్ప !

ఒక వంద మంది అమెరికన్ సైనికులు, మూడు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, రెండు టాంకర్లు ఈ సందర్శనల మెకేన్‌కు తోడుగ వెల్లినయంట, అయ్యో మర్చిపోయిన మెకేన్ ఒక బుల్లెట్ ప్రూఫ్‌వెస్ట్ కూడ వేసుకున్నడంట !

మెకేన్‌కి ఇచ్చిన దాంట్ల సగం భద్రత ప్రతీ ఇరాకీ పౌరుడికి ఇచ్చినంక వాల్లు కూడ, ‘ఇరాక్ సస్యశ్యామలం’ అని అప్పుడు అంటరేమో మరి ?


Leave a response

Your response:

Categories