Posted by: JayaPrakash Telangana | October 5, 2006

తెలంగాణవాదం ఇంట్ల నుండి శురుగావలె !

* నేనేంది, తెలంగాణ ఏంది, దాని వాదం ఏంది. దీని గురించి చాన రాసేదున్నది, ఈ వ్యాసం తర్వాత వచ్చేవాటిల్నిండ అవే ఉంటయి అప్పటి దాక జర ఆగాలె.

తెలంగాణ వందల ఏల్ల నుంచి ఎన్నో రకాల భాషలతోటి ప్రభావితం అయింది. ముఖ్యంగ చివరి నాలుగొందల ఏల్ల నుంచి, పైకి పోతె మరాఠి, అటు పక్కకి పోతె ఇంగ్లిషు, ఇటు పక్కకు పోతె కన్నడ, హైద్రాబాదుకు  పోతె ఉర్దు. తెలంగాణ భాషను ‘సంకర భాష’ ‘ప్రామాణిక భాష కాదు’ ‘ఏవోనండి వాళ్ళు మాట్టడేదాంట్లో ఆవగింజంత వ్యాకరణం ఉండి చావదు’ అని ఎన్నో తీర్ల మజాక్‌జేస్తరు. భాష సంభాషించుకోనీకి, సంభోధించుకోనీకి ఒక సాధనం మాత్రమే, భాషను కొలుస్తమా? ఒక భాష గొప్ప ఇంకోటి కాదని ఏముంటది, ఎవని భాష వానికి గొప్ప !


మా అమ్మగారోల్లది సికింద్రాబాద్, నయినోల్లది గంగదేపల్లె (గంగదేవిపల్లె, వరంగల్ నుంచి నర్సంపేట పొయ్యేదార్ల). (మా తాత సికింద్రాబాద్ నుంచి గంగదేపల్లెకి 155 కిలోమీటర్లు సైకిల్ ఏస్కొని ఒచ్చెటోడంట అమ్మని సూడనీకి, ఎంతైనా ఆ జమానాల మన్షులే వేరు). నాకు ఊహ తెల్సినప్పటి నుంచి మానాయిన ‘ఈనాడు’ పేపరేయించుకుంటడు (పదేల్ల కింద, వేరె పేపర్లు ఎట్లుంటయో సూద్దం అని కోశిశ్ చేసిండంట, కని అల్వాటైన పానంగద నచ్చలేదంట) నేను రెండేల్లున్నప్పుడే నన్ను ఇంజనీర్ను జెయ్యాలనుకున్నడంట.

నాల్గేల్లు ఉన్నప్పుడు తెల్ల కుర్తా-పైజామ ఏసి పోడుగు నామం పెట్టి  మేముండే లేబరోల్ల వాడల (పది పన్నెండేల్ల కింద మూసేసిన ఆజంజాహి మిల్లు కార్మికులంతా ఉండే వాడ పేరు) సైకిల్ మీద తీస్కపోతుంటె ‘ఈల్ల పిలగాడు సూడు అచ్చం బాపనోల్ల పిలగానిలెక్క ఎంత ముద్దొస్తడో’ అనెటోల్లని చెప్పేది మా అమ్మ, అదేందో బాపనోల్లు తప్ప ఇంకవేరే పిలగాండ్లు ముద్దుగుండనట్టు! బడిల సదివే దానికంటె వాడల నేర్సుకునేటియే ఎక్కువ కదా? ఇంటికొచ్చి ఓనాడు ఎవర్నో ‘లం*కొడ్కా !’ అని తిట్టంగ ఇన్న నాయిన నెల తిర్గక ముందే వరంగల్ల ఇల్లు తీస్కున్నడు. నాకొడ్కు ‘దొరబిడ్డ’ లెక్క పెర్గాలె, పెద్ద ఇంజనీరు కావాలె అన్న కోరిక, ఎన్నో కష్టాలు పడి తీర్చుకున్నడు. మా అమ్మానాయినల కష్టం నన్ను పెద్ద ఇంజనీరునుజేసిందో లేదోగని, అమెరికాల సాప్ట్‌వేర్ కన్సల్టెంట్‌ని మాత్రంజేసింది.

తెలంగాణలగూడ ఒకో ప్రాంతానికి కొంచం యాస, పదాలు మారుతుంటయి. మా అమ్మ పట్నం (సికింద్రాబాద్) ల పెరిగింది కన్క నైజామోల్ల ఉర్దు కలగలిపినట్టు మాట్లాడేది. చిన్నతనంల అప్పుడప్పుడు అమ్మను నాయిన ‘ ఒచ్చిండు, పోయిండు… ఏం భాష ఇది పట్నపు తుర్కం’ అని ఎక్కిరించెటోడు. చిన్నతనంల ఏమైతుందో ఎర్కగాలె. అందరితోటి కలిసి నేనుగూడ నవ్వెటోన్ని. అమ్మగూడ నవ్వినా అండ్ల కొంచం బాధ కనిపంచేది. ఇట్ల సంవత్సరానికోసారో రెండు సార్లో అమ్మను ఎక్కిరించినట్టనిపిచ్చేది. ఏం సమజ్ గాక పోతుండె.

బడిలగూడ తెలుగు పాఠాలప్పుడు, పుస్తకాలల్ల ఉన్నది ఉన్నట్టు సదివినా రాసినా, అప్పుడప్పుడు వాడుక భాషదొర్లేది. పంతులమ్మ ఎక్కిరించేది, అప్పుడప్పుడు కొట్టేది, మార్కులుగూడ తీసేసేది. అరె నేను రాసినదాంట్ల తప్పేమున్నది, ‘వచ్చాడు..పోయాడు…’ అనకుంట ‘వచ్చిండు… పోయిండు..’ అన్నంత మాత్రాన వచ్చెటోడు రాక మానుతడా, పోయెటోడు పోక మానుతడా అనుకునేది. చెప్పేది రుబ్బి రాసి మార్కులు రాంకులు ఎట్ల తెచ్చుకోవాలో చెప్పే సదువులాయె మనయి, తర్కం నేర్పుతరా, ఎదురుప్రశ్నలడుగుతె ఊకుంటరా? ఆ మద్య వరదొచ్చినట్టు (ప్రవేట్ రెసిడెన్షియల్) ఇంటర్ కాలేజీలోచ్చె, పదోతర్గతి అయినంక తీస్కపొయ్యి గుంటూర్ల ఏసె, ఇంకేం జెప్పాలె ఆడతుమ్మినా పాపమే దగ్గినా పాపమేనాయె. ఏడికి పోయినా భాషా, ప్రాంతం పేరుమీద వెక్కిరింతలైతే తప్పలె, ఏంది ఈ లొల్లి అనుకుని ఊకునేది. అవసరమైన దెగ్గెర మాట మార్చుకుని ఉండాల్సొచ్చేది, అట్ల ఇష్టం ఉన్నా లేకున్నా ఆడ ఉండాలె కాబట్టి ‘ఆంధ్రం’ అల్వాటు జేస్కున్న.

అమెరికా ఒచ్చిన కొత్తల అందర్లెక్కనే జోష్‌ల ఒచ్చిన, కొన్నేల్లకు సెప్టెంబర్ 11 దుర్ఘటన ఐంది, రోజులు మారేకొద్ది, పరిస్థితులు మారేకొద్ది, జిజ్ఙాస పెరిగి అది ఇది సదువుకుంట సింగిల్‌ట్రాక్ మైండ్‌సెట్ ఒదిలి కొంచం హేతుబద్దంగ ఆలోచించే టైంల తెలంగాణ పేరు వార్తల్ల విన్న, కొన్ని రోజులు అయోమయ పరిస్థితుల ఉండుడు. తర్వాత తెలుస్కోవాలనె కొరికతోటి సదువుతుంటె తెలంగాణ చరిత్ర, దాని భాష, కళ, సంస్కృతి, బతుకుల అనిచివేతల గురించి సదివినకొద్ది కొత్త విషయాలు తెలుసుడు. మొత్తానికి ఆలస్యమైనా నేనెవరినో నా ఏర్లెక్కడున్నయో నా గుర్తింపు ఏందో తెలుసుకున్న, నా చిన్నతనం నుంచి అనుభవించిన (కొద్దిపాటిదైనా) అసమానతలకు ఓ సమాధానమైనా దొరికిందిప్పటికి. *

మా నాయిన ప్రవర్తనలకి కారణాలు కనిపిచ్చుడు మొదలైనయి. గత ఇరవై ముప్పై ఏల్ల నుంచి వస్తున్న సాంస్కృతిక మార్పులకు నాయినగూడ ఎట్ల బలైండని అర్థమైంది. ముందు వార్తపత్రికల తోటి ఇప్పుడు కేబుల్ టి.వీ తోటి, ఇట్ల మాట్లాడితెనే సరిగ్గ మాట్లడినట్టు అట్లైతె కాదు అని ఒక స్లో పాయిజన్ లెక్క ముప్పై ఏల్లు తెలంగాణ ప్రజలను ఎట్ల న్యూనతాభావానికి గురిజేసింరో తెల్సొచ్చింది. జనం వాడే భాష ఏడ ఇనబడ్తది, ఆకాశవాణిలనా, టి.వీలల్లనా, పత్రికలల్లనా ?

మార్చి 2006 ల తెలంగాణకు పోయినప్పుడు, ఆ ఊరు ఈ ఊరు తిర్గినంక ఇంక చాన అర్థమైనయి *. మొత్తానికి ఇంక తిరిగి పయనమయ్యే టైం దగ్గర్కొచ్చింది, అందరం కలిసి తింటున్నప్పుడు ఎప్పటిలెక్క అమ్మ మీద ఏసే పాత జోకు ఈసారి నా మీద ఏసిండు నాయిన ‘ఏమిరా అమెరికా పోయినాగాని మీ అమ్మగారోల్ల భాష మర్చిపోలేదా?’ అని, ఎప్పటిలెక్కనే అమ్మ నవ్వుకుంట అన్నం పెట్టుకుంట కూసున్నది. ‘నాయినా ! నేను ఈ గడ్డ మీద పుట్టిన, ఈ నేల నాది, ఈ భాషనాది, ఇది బైటికి చెప్పనీకి నేను ఏ మాత్రం సిగ్గుపడ’నని చెప్పిన.

అమ్మ ఎప్పటి తీరుగ తల్కాయ దించుకోకుంట, నన్నుజూసి సంబరపడ్డది. తల్కాయ దించుకునుడు ఈమారు నాయిన వంతైంది. ఇదే మాట ఇర్వై ఏల్ల కింద ఎవలన్న మా నాయినకు చెప్తె బాగుండేది, నేనిన్ని రోజులు నా గుర్తింపు కోసం కొట్లాడల్సిన అవసరం లేకుండేది, రాకుండేది.

If you liked this also read మూడు కలలు : ఒక గొడ్డలి


Responses

 1. భావమే భాష కంటే ముద్దు. తూరుపోళ్ళ భాషను, తెలంగాణ భాషను, రాయలసీమ భాషను హాస్యానికి వాడుకునే కుచ్చితత్వం సినిమా జనాలనుంచే మొదలయి రాష్ట్రమంతా పాకిందండి.

  ఇప్పటికీ నా స్నేహితులు కొంత మంది నన్ను శ్రీకాకుళం యాసతో హాస్యమాడతారు…నేను ప్రపంచమంతా తిరిగి యాస అనేదే లేకుండా తయారయ్యాను. సగం భాష ఇంగిలిపీసే :-)

 2. That has been a great narration of your ‘self’ and the struggle to assert its identity. its like listening someone speaking out his mind while sipping chai

  True, how people were glad to cycle all the way from secunderabad to warangal. to meet one’s friend. and how strange it is the same person who thinks his friend’s language was a bit ‘poor’

  Asserting in the street and losing or winning there is one thing. holding your head high among your own people and feeling proud of what you are is a different thing altogether. that makes one live with pride and peace. very few have the courage to do that. accepting truth is no easy and finding beauty in truth is no simple.
  Many people try imitating the language of their colleagues not in a place like vijayawada or guntur or elsewhere but very much in kasibugga or hyderabad and in one’s own home. people of telangana need to pull off this ‘beautiful’ mask that is pasted on us by the text books, the eenadu papers, films, the guntur colleges opening doors to america or IITs, and the nakili politicians. the facade that has become almost ‘real’ to some or more people now needs to go if we have to have our own state in our own way.

  enjoyed reading the assertion beginning at home, keep writing, best wishes,

  M Bharath Bhushan

 3. yeah padke hume tho aisa laga, bahuth dinoke baadh hame apni hyderabad me irani chai mili ho,

  sirf bolniki baath hi nahi yeah bol tho hame apno ke pass laathi hai.

 4. hum tho telangane ke hai, aur saaf saaf kaha jaaye tho Hyd – warangal ke hai,

  jo pardes me hai, unhe tho aap like so padakar mitti ki yaad tho jarror aathi hogi

  aisi hi bol acchi lagthi hai, dilko choo letha hai

 5. Your nostalgic piece is fantastic and it made me cry.

  Really, I felt like reading something from my own experience and tears brimmed in my eyes.  I joined WordPress to write this comment and all my compliments, indeed my heart, go out to you. Keep it up. Explore how our roots are erased and how are we forced to change our natural tongue and attitudes, in a systematic way.

  Venu Gopal

 6. I want more information on Telangana. All these days I am in confusion about Telangana. Now I understood the way other region people are spoiling the Telangana culture. Media,movies and news papers are playing important role in this regard. As a fellow Telanganite I suggest not watch any Telugu movie and Telugu channels unless and until they respect the Telangana culture.

 7. “నాకొడ్కు ‘దొరబిడ్డ’ లెక్క పెర్గాలె, పెద్ద ఇంజనీరు కావాలె అన్న కోరిక, ఎన్నో కష్టాలు పడి తీర్చుకున్న” మీ ‘నాయిన’ తలవంచకుండా చూసుకోవాల్సిన బాధ్యత కన్నా మించిన ‘గుర్తింపు’ మీకు (నా ఉద్దేశ్యంలో) ఎక్కడా లేదు! అటువంటి పుణ్యాత్ముల కడుపున పుట్టినందుకే మీరు ఎంతో గర్వించాలి.

 8. Japes తన తల్లిదండ్రుల పట్ల గర్వపడ్డడు కాబట్టే వాళ్ళు తనను ఎంత కష్టపడి పెంచిందీ రాసిండు. ఎంత మంచి తల్లిదండ్రులయినా సమాజంలోని మార్పుల ప్రభావానికి లోను అవుతూనే ఉంటరు, వాళ్ళకి కూడా కొన్ని సరియైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు. పత్రికలల్ల వచ్చే భాషే గొప్పది అన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న వెక్కిరించేప్పుడు చిన్నప్పుడు తను కూడా అందరితో నవ్వడం, తర్వాత అది సరియైనది కాదని తెలుసుకొని తండ్రికి తన అభిప్రాయం చెప్పడంల తప్పు ఏముందో నాకు అర్థం అయితలేదు. నాన్న ఒక క్షణం తలవంచుకున్నా కొడుకు ఎందుకు అట్ల అన్నడో అలోచించకపోడు. ఇక తండ్రి అయినంత మాత్రాన, కష్టపడి పెంచినంత మాత్రాన, పిల్లలు తమ అభిప్రాయాలని తండ్రికి చెప్పొందంటరా నాగరజా గారు? తలవంచకునేట్లు చేయొద్దనే మాటను పట్టుకుని చూసినా మరి కొడుకు తండ్రితో తన అభిప్రాయం చెప్పకపోతే తల్లి తలవంచుకోవాల్సి(బాధపడాల్సి) వచ్చేది కదా. తల్లి బాధపడితే పర్వాలేదు అంటరా? ఏదో ఒక విషయంలో తన తండ్రి అభిప్రాయం తప్పు అని చెప్పినంత మాత్రాన అతనికి తండ్రి పట్ల గౌరవమే లేనట్లు మాట్లాడుడు హాస్యాస్పదంగ ఉంది.

 9. రచన చాలా సహజంగా ఉంది. భాష, మాటలు ఒకే పద్ధతిలో వాడితే బాగుంటది. ఉదాహరణకు బాస అని రాయోచ్చు, భాష అని కాకుండ ఎందుకంటే రచనంతా ఇంచుమించు తెలంగాణ మాండలికంలో ఉంది. కథ చదివినంత ఆసక్తితో చదివి fiction కన్నా fact గొప్పగా ఉంటుందంటే ఇదేనేమో అనుకున్నాము. తండ్రి కొడుకు బూతు మాట్లాడొద్దు అనుకున్నాడు. పెద్ద చదువులు చదువాలనుకున్నాడు. దొర వోలిగె బతుకుడంటే అదే అనుకున్నాడు. బూతులు gender, caste పేర్లతో బ్రాహ్మలే సృష్టించారని ఆయనకు తెలియక పోవచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లే సృష్టించారని అనుకుంటున్నాడు. పెద్ద చదువులు కూడా దొరలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి గనుక తన కొడుకును దొర బిడ్డలా పెంచాలని కష్టపడ్డాడు. అనుకరణ ఆధిపత్య భావజాలం ప్రభావమే. తెలంగాణ వాళ్లము కోస్తా పత్రికల భాషను అనుకరిస్తున్నట్లు. నాయన అప్పటికి తల వంచుకున్నా అది అవమానపడి కాదనుకుంటాను. Realise ఐతే తర్వాతనైనా కొడుకు తనదే కాదు తల్లిదండ్రులందరివి కూడా roots కనుక్కుంటున్నాడని గ్రహించి గర్వపడుతాడు. Keep it up. ఇంకా రాయండి. Congrats!
  V.V

 10. మీ బాష,శైలి,కథనం ఆసక్తికరంగా సాగాయి. బాష ప్రయోజనమేమిటి? కేవలం మట్లాడటానికేనా లేక దానిలోని సొగసులు చూసి ఆనందించటానికా అన్న మీమాంస కలిగిస్తోంది మీ కథ.

 11. నా మొదటి రచన ఇంత మందిని మెప్పిస్తదని నేనెప్పుడనుకోలె. అందరి మిత్రుల మెప్పుకోలు , విమర్శలే నాకు కొండంత ప్రోత్రాహం. తొందర్లనే ఇంకో మంచి రచన అందరి ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్త.

  ధన్యవాద్

 12. great .. it just touched my heart and literally wept for few seconds , I was writing wiping my tears . andarini vadili desam kaani desamu lo , baasha kaani bhaasha lo matlaadutu , ade bhaasha ni tintu vunna maa laantivariki ..oo manchi ata vidupu . This is not your life man , idi oka bimbamu endari jeevitaalu no choopistundi.

 13. i like this language very much its totally deffirent i wish u all the best for u and our telangana

 14. I share your anguish about being ridiculed about talking in Telangana dialect or idiom.
  And I’m for a strong and well-developed Telangana.I love Telangana Talli.
  In fact, I’m spreading the word that an innovative solution for the Telangana struggle is to rename the entire state “Telangana”. By doing so, people from Telangna will get Telangana state, and the people from the other two regions will have the satisfaction that the state is united under a better name.Think about it.How “Telugu” is “Andhra Pradesh”? It rhymes with UP, MP, HP and Arunachal Pradesh, whereas most other states have names reflecting their culture, language and heritage(Kerala, Karnataka,Maharashtra,Gujarat,Orissa etc). It’s a win-win for both.

  But, the fact is that there is no such thing as Telangana language.Our language is Telugu, and in the Telangana region it got corrupted by Urdu due to the invasion and rule by muslims for hundreds of years.
  Taking pride in something that got distorted and fighting for it is not the wisest thing to do.We must try to improve our language.
  The reason your dad made fun of your mom is that he knows that the language we all speak is not correct and he wanted everyone to improve, including your mom.And, of course she is an easy target for him.
  Kakatiyas didn’t speak in Telangana accent.Pothana didn’t write Bhagavatham in Telangana dialect. In our time, Dasarathi and Narayana Reddy didn’t write poetry in Telangana idiom.Everyone read, wrote and spoke Telugu.
  At the same time, our brothers and sisters from Andhra region should stop ridiculing people of Telangana at every possible opportunity using every possible medium.
  The responsibilty to bridge the gap rests on all of us.

 15. తెలంగాణ మాండలికం లొ ఉన్న ఈ కథనం చాలా బాగుంది

 16. అన్నా !
  నీ కథనం జూత్తంటే నేనుగూడ నా భాషల్నే రాయాలె అనిపిస్తాంది. చాన బాగున్నది నువ్వు రాసిన తీరు.యిట్లనే మరిన్ని రాయి.

 17. Chala Chala bagundi

 18. Japes,
  I used to read and enjoy short stories by Nayani Subrahmanyam Naidu, published in, i think, ‘Andhra Jyothy’ weekly when I was in Hyderabad. These short stores were in Rayalaseema dialect and most of them describe life of small scale farmers.

  I read this story in Telengana dialect and i enjoyed the same pleasure after a long time. Congratulations and keep it up.

  I don’t think that one dialect is better than another. Every dialect Coastal Telugu, Telangana Telugu, Rayalaseema Telugu, and Uttara Andhra Telugu has its own duty when it flows from the pens of people like you.

 19. first koncham chadavadaniki kashtapadda………
  kaani chaduvutunna koddi edo sweetness naku
  kanipinchindi………..

  naaku kuda telangana yasa nerchukovalani undi………..aaa yasalone
  matladalani undi…………very nice ……….

 20. For me Telugu is beautful.. I fighht still with my schoolmates in chittoor telugu with tamil words thrown in,talk sophistcatedly when I am talking with Govt officials in English telugu!! with my collegemates from coastal Andhra in the pure telugu and with some workrs in Vizag slang. But the beauty is telangana telugu since I started living here 20 years back. I enjoy everything in its own way….

 21. superb!!

 22. mastu raashinavanna
  baagundi
  inthaki neeku telangana raavala vadda?

 23. Hindi jokes are very much in demand.We all love reading and listening them.Look here for the best hindi jokes

 24. dear j.p.
  as i completed reading it in a gulp, i heaved a sigh of relief. it gave me a feeling that writers like u who r hard-core telanganites can make mana baasa, yaasa make live long. hats of to u. pl keep it up. i wish many such animutyaalu from ur mighty n ready pen will pour out n fill our hearts with bliss.
  urs, bhasker.k

 25. […] you liked this also read తెలంగాణవాదం ఇంట్ల నుండి శురుగావలె […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: