Posted by: JayaPrakash Telangana | October 15, 2006

శశి !

పెద్దాయన ( శ్రీ.శ్రీ ) ‘ఖడ్గసృష్టి’ ల ‘శరశ్చంద్రిక’ సదువంగనే మనసుల కొంచం కలకలం లేసి రాసిన కవిత ఇది (ఇక్కడున్న బొమ్మ తర్వాత వేసింది). ఈ కవిత పెద్దాయనకే అంకితం.

ఇక్కడ క్లిక్ చేసి ముందు ‘శరశ్చంద్రిక’ సదివినంకనే నా ఈ ‘శశి’ని సదవాలని కోరుకుంటున్న!

*  *  *   Sri Sri

వచ్చావా చంద్రమా
ఇక మాట్లాడుకుందామా!
అనుకోలేదపుడే
గడుస్తుందని ఒక యుగం 

ఎపుడూ అనుకోలేదు
మళ్ళీ నిన్నిలా కలుస్తానని,
మరలా మదిలోని
మాటలిలా తలుస్తానని. 
 

నిజం చెప్పాలంటే
గొప్పగా మార్పులేమీ లేవు,
పోయిన సారి ఇచ్చిన
progress report నే మళ్ళీ చదివేసుకో

ఎన్నో మార్పులొస్తాయనుకున్నా
ఇంకెన్నోజీవితాలు
బాగుపడతాయనుకున్నా 

కడుపుకు తిండీ,
ఒంటికి గుడ్డా,
కనీస వసతి, 

ఈ మాత్రం సాధించడానికి
యుగాలేల, సంవత్సరాలు చాలవ?
మరలా నిన్ను కలిసేలోపు
ఇవన్నీ సాధించలేమా? 
అనుకున్నా ! అనుకున్నా !
అనుకుంటూనే ఉన్నా !  

ఎన్నో కొత్త విషయాలు
చెపుదామనుకున్నా
పోయినసారి మరచినవన్నీ
వివరిద్దామనుకున్నా 

నేనున్న నూతిలోనేనా
ఈ విలాపాలు
లేక నువ్వు కాచే ప్రతి అడవిలోనా
ఇవేనా విశేషాలు?

దేశానికే కడుపునింపే రైతన్నలు
ఉరిపోసుకుంటున్నారు
తిన్నదరగక చస్తున్నారని
ఇంకొందరు వారి ఉసురుపోసుకుటున్నారు.

రెక్కాడినా డొక్కాడని
బతుకులన్ని వలసవచ్చాయి
పట్నంలో పెదబాబుల చెప్పుకిందే
అలసి చచ్చాయి

చాలా రోజులకి మళ్ళీ కలిసాం
ఇంకా నీదదే సోదనుకుంటున్నావా?
త్వరగా ముగిస్తే,
మరో పిచ్చివాడిని కలుద్దామనుకుంటున్నావా?

ఏమి చేయను శశీ,
గుల్జార, అక్తర్ లను
మించినిన్నుఎన్నో సార్లు పొగిడేసా,
కాని నీ విషయంలో
నా కన్నా వాళ్ళే మిన్నని వదిలేసా !

ఏమి అనుకోనంటే
ఒక విషయం చెబుతా,
ఆ పై అలగనంటేనే
ప్రస్తావిస్తా !

డొక్కెండితే ఎవడైనా
నిన్ను పొగడగలడా ?
ఇంక నిన్నే చూస్తూ
అలా నిలవగలడా?

ముందే చెప్పా కదా
కోపం తెచ్చూకోవద్దని
నీకు తెల్సుకదా ఇవన్నీ చూస్తే
నా కడుపు మసులుద్దని

*  *  *

నాకు ఓటేస్తే నీళ్ళిస్తానని
ముంచేవాడొకడు,
నాకేస్తే భూములిస్తానని
రోడ్డుపాలు చేసేవాడింకొకడు 

ఇన్ని జరిగినా
ఎవరో వస్తారని చూసేవాళ్ళే అందరూ
నేనున్నానని
అభయమిచ్చేవాళ్ళెందరు?

లేకే, ఉన్నారు
కొందరున్నారు,
లాకప్పులు, encounter లను
తప్పించుకు మిగిలి ఉన్నారు.

ఎందరున్నారన్నది కాదు
నా బాధ !
వాళ్ళ తరువాత తరం
సిద్ధంగుందా లేదా?

లేకే వాళ్ళూ ఉన్నారు,
కన్నెలతో కనువిందు చేసుకు
క్షణం తీరిక లేక
కొందరు

సినిమాలని సొంగ కారుస్తూ 
internet లని, fashion లని
బరితెగిస్తున్నారు
మరికొందరు

America అని ఒకడంటే
UK అని ఒకడంటూ
పరుగులెడుతున్నారు
పారిపోతున్నారు

దేశానికే దశమార్చే
యువతనేడు,
ఏ దిశగా వెళుతుందో,
ఏ గతిగా పయనిస్తుందో?

పోలియో ను నిర్మూలించే
మందుకూడ వచ్చింది,
కాని భావి భారతం అప్పటికన్నా
మరింత చచ్చుబడింది

*  *  *

నాకేనా ఆవేశం
ఆక్రోషం
అసహనం?

ఆంధ్రావని అవతరించి
అపుడే అర్థ శతాబ్ధం కానున్నది,
నూరు తప్పులు ఎప్పుడో మించినవి
నాయకుల అరాచకాలు ఇంకనూ సాగుతున్నవి

మొదటిసారి అరిచి
ఏట్లో కలిపిండు చెన్నయ్య,
మరల కేకలేస్తుండిరి
ఏం చేస్తడో ఈ గన్నయ్య

మహానదులను మరల్చగలమని
మురిసిపోయాను,
కాని గోతికాడ నక్కలుంటాయన్న సంగతి
మరచిపోయాను

ఇంటికవతల గోదారె
ఇవతలకి కృష్ణమ్మే,
ఐనా బతుకులన్ని ఎడార్లే
రగులుతున్న కాష్టాలే !

నాకు తెలుసు జాబిలీ
సుతిమెత్తని మబ్బుల్లో తేలే నీకు
మేం అందరం ఒకేలా కనిపిస్తామని,
అప్పుడప్పుడైనా తలపిస్తామని

కాని మా డొక్కల డప్పులు
రెక్కల తిప్పళ్ళు
మమ్మల్నేలేవారికి వినిపించేనా?
కనీసం కనిపించేనా?

లాహిరి అంటూ వెళ్ళే నీకు
నాతో ఎందుకీ తిప్పళ్ళు !?
నా ఇల్లు రాగానే, ఏ మబ్బుమాటునో
దాక్కోక, అవసరమా నీకిన్ని చిక్కులు?

ఎన్నో మార్లనుకున్నాను
ఇకనైనా నిన్ను విసిగించొద్దనుకున్నాను,
కాని ఏం చెయ్యను, నీ visitor list ను
పెరగకుండా ఆపలేకున్నాను

ఇదివరకు చెప్పిన వారందర్ని
అదివరకు మరచిన వారందర్ని
పలకరించే వెలతావో,
నీ వెన్నెలను వారిపై చిలకరించే వెళతావో?

అనువు ఉంటే మరోమారు
కలుసుకుందాము,
మిగిలిన విషయాలేమైనా
తలుచుకుందాము !

*  *  *

( ఈ కవిత 15 ఆగష్టు 2005 న రాసిన, పెద్దాయన ‘శరశ్చంద్రిక’ రాసినంక ఇది రాసేంత వరకు , ‘శశి’ ఇంకా తెలుసుకోనియేమన్న ఉంటే చెప్పిన అంతే.

అయితె అమెరికా, యూ.కె. అని ఉరుకుతున్నవారిలో నేను ఉన్నందుకు చింతిస్తున్న. ‘శశి’ నా మొదటి తెలుగు కవిత, దీంట్ల ఏమైనా తప్పులుంటె పెద్దోళ్ళు మన్నించాలె. )


Responses

 1. It’s nice….the flow is good.

 2. JP గారూ,
  మీరు నేనెక్కువ చెప్తున్నానుకోకపోతే పెద్దాయనే మళ్ళీ తన “శరశ్చంద్రిక”ను కొనసాగిస్తున్నట్లనిపించింది. ఇది కూడా ఆయన శైలిలోనే సాగింది. ఇంకా మీరు ఎన్నో విషయాలు మరిచిపోయే వుంటారు లేదా 2005 ఆగష్టు నుంచీ ఇంకా ఎన్నో విషయాలు శశికి చెపుదామని దాచుకొని వుంటారు. మళ్ళీ చెప్పండి శశికి, మేము వింటాం.
  ఈ చిత్రం కూడా మీరే వేశారా! చాలా బాగుంది ఫ్రేములో దొరికితే మా ఇంట్లో పెట్టుకుందును.
  –ప్రసాద్
  http://charasala.com/blog/

 3. అదరగొట్టేశావు గురు
  డొక్కెండితే ఎవడైనా
  నిన్ను పొగడగలడా ?
  ఇంక నిన్నే చూస్తూ
  అలా నిలవగలడా? ..భేష్

 4. అద్భుతంగా ఉంది మీ పెయింటింగ్.

 5. నా మొదటి కవిత ఇంత మందిని మెప్పిస్తదని నేనెప్పుడనుకోలె. అందరి మిత్రుల మెప్పుకోలు , విమర్శలే నాకు కొండంత ప్రోత్రాహం. తొందర్లనే ఇంకో మంచి రచన అందరి ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్త.

  ధన్యవాద్

 6. ఈరగ తిసినవు

 7. నేను మీ కవిత ఇప్పుడే చూస్తున్నాను.
  నేను శరశ్చంద్రిక చదివినప్పుడు
  ఏది రాసినా ఏం లాభం
  ఇదివరకెవడో అనే వుంటాడు
  బహుశా ఆ అనేదేదో నాకన్నా
  బాగానే వుండొచ్చు. అలాంటప్పుడు
  మళ్ళీ
  కలం కాగితం మీద పెట్టి
  కళంకం లేని తెల్లదనాన్ని
  ఖరాయి చెయ్యడమెందుకు ?

  ఈ వాఖ్యాలు చదివే సరికి, మళ్ళీ ఎప్పుడూ జీవితంలో వెన్నెల మీద కవిత వ్రాయలేనేఁవో అనిపించింది.
  నిజంగా శ్రీశ్రీనే గివ్వప్ప్ ఇచ్చాక నేనంత అన్నట్లుగా ;-)

  కానీ మీరు అలా కాకుండా స్ఫూర్తినొంది కవిత, అదీ ఇంత మంచిది వ్రాసినందుకు అభినందనలు.

 8. Thank you very much, that was my first and last Telugu poem to date. SriSris poetry is so inspirational that i couldn’t resist but write a rejoinder., offcourse other half of the credit goes to the atrocities that have increased from the time SriSri wrote ‘Sharchandrika’


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: