Posted by: JayaPrakash Telangana | January 24, 2007

తెలంగాణా వాళ్ళకు తెలుగు రాదా?

– ఎస్. సదాశివ

1971వ సంవత్సరం, వేసవి సెలవుల్లో ఐదుగురం మిత్రులం పత్తాలాడుతున్నాము. మా హెడ్‌మాస్టర్ గారు కూడా మాలోనే వున్నారు. అటెండర్ స్కూల్ పోస్టు పట్టుకవచ్చి హెడ్‌మాస్టర్ గారికిచ్చాడు, D.P.I ఆఫీసు నుంచి నాపేర ఒక కవరు వచ్చింది. D.P.I అంటె Director of Public Instruction. అప్పటికి School Education, Higher Education వేరుపడలేదు. నా పేర కవర్ రావటం అందరికీ వింతే. ఎవరో కవర్ విప్పి లెటర్ చదివి వినిపించారు. Nationalized Text Booksలో నేను ఐదవ తరగతి తెలుగు వాచకం రాయాలట. అంగీకారమో కాదో తెలియజేయవలసిందని రాసినారు. “ఇదంతా ‘నామ్ కే వాస్తే’ వ్యవహారం, Text books రాస్తామని ఎందరో పైరవీలు చేసుకుంటారు. వాళ్లను కాదని తెలంగాణాలో మారుమూల ప్రాంతమైన అదిలాబాద్ లో వున్న సదాశివనెవరు రచయితగా నియమిస్తారు? పదిమందికి పంపినామని చెప్పటానికి కొందరికిలాటి ‘నామ్ కే వాస్తే’ లెటర్స్ పంపిస్తారు, ఇదీ అలాటిదే, రచయిత యెవరో ఈపాటికే నియుక్తుడై వుంటాడు. రచయితగా మీకింత పేరున్నది కనుక మీకూ ఒకటి పంపినారు” అని తేల్చి చెప్పినాడు అనుభవజ్ఞుడైన ఒక సహోపాధ్యాయుడు, అందరికీ అదే నిజమనిపించింది.

మొత్తం చదవండి »


Responses

 1. మీరు రాసిన విషయంలో నిజం ఉండొచ్చు. కాని దానికి మీరు పెట్టిన శీర్షిక బాలేదు. ఊరికే ఇలా మేం తెలంగాణావాళ్ళం మమ్మల్నెవరో తక్కువగా చూస్తున్నారు అంటూ లేని పోని కాంప్లెక్సులు వృద్ధి చేసుకోకండి. ఒకవేళ ఎవరికైనా అలాంటి కాంప్లెక్సు ఉంటే వారిని అందులోంచి బయటికి లాగండి మీకు చేతనైతే.

 2. ఈ వ్యాసం పాత వార్తపత్రికల ఒచ్చింది, దాన్ని ఉన్నదున్నట్టుగ హోస్ట్ చేసిన్రు. తెలంగాణలో ఏం జరుగుతుందో, ఇదివరకు ఏం జరిగిందో ప్రజలకు తెల్పడానికి ఇదొక ప్రయత్నం మాత్రమే, నిజానిజాలు వ్యక్త పరచడం మొదలు పెట్టంగనే ఇంత రోషమొస్తే ముందు ముందు చాల చేదు నిజాలు బయట పడ్తయి ఇంకా, వాటి సంగతేంది భయ్ !

  మీకు అన్యాయం జరిగితె జరిగింది, మీకు కాంప్లెక్సులు ఉంటె ఉండనీ కాని దాన్ని కొంచం tone down చేసి రాయండి అన్నట్టు ఉన్నది, ఇప్పుడున్న మీడీయా సెన్సర్ షిప్ (Media Censorship) సాలదన్నట్టు (be it in regional / National / International fronts). అసలు ఈ వ్యాసం ఉద్దేశమే ‘తెలంగాణవాల్లకు కూడా తెలుగు ఒచ్చు’ అని, అంతకంటె సక్కని పేరు ఇంకోటి ఉండదనుకుంటున్న నేను.

  అది కాదు Bala Subrahmanyam భయ్ ! ఎవరో (ఎస్. సదాశివ) రాసిన దాని పేరు నేను మార్చలేను కబట్టి అట్లనే పెట్టిన.

 3. good one. But I might have experienced this kind of experiences atleast 10 times in my life due to my my uttaraandhra accent. This is not happening just to telangaana area. I too found a hype and inferiority complex is being built in telangana people recently and political leaders are naming it as aatma gauravam. many of my telangana friends are worried and feeling very bad on these moments. Because they love telugu as language but not like dividing wall between telugu people.

  How many telangana people are really talking telangana accent these days and writing in that accent. every part in andhra has an accent and that need not to be forced as a culture and that is not a heritage of language too. A language stands like a diamond forever regardless of accents if the people love it just like a language to communicate and nothing else.

  This article shows some bitter truths…thats for sure. But these kind of bitter truths are not limited just to language. These are basically carry forwarded by forward castes like brahmins since long in all the places. They talk one particular telugu with out accent in any area of andhra. In this situation, I believe its a political domination just like that. if you talk about bitter truth, no other accent was taken for fun as uttaraandhra accent was taken (by media, movies even by telangana people). I myself struggled in warangal and faced discrimination and become funtoy becoz of my accent in engineering. This is nothing but a typical talent of telugodu.

 4. I totally agree with you. Language is just a means of communication. we’ve been induced ‘to disrespect’ others language or culture., its time we realise it and start respecting others feelings

 5. india vallaki english matladatam raadanedi enta nijamo telangana vallaki telugu raadanatam ante nijam… navvukotaniko…. saradaako appudappudu ane maatalu ivi…. deenni kuda rajakeeyam cheyyadaniki konta mandi choostaru.. pukarlaki manam andolana chenadam kada mari!

  Vishayam ardham ayyindi anukuntanu…. konchem heading alochinchi pettalsindi… vere raastram kaavalani meeku unnattu undi… auna??

 6. Eurekaaa ! :)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: