Posted by: JayaPrakash Telangana | February 14, 2007

హాపీ వెలంటైన్స్ డే !

Happy valentines Day !వెలంటైన్స్ శుభాకాంక్షలుంటయని ఒచ్చి నీరుగారే సోదర సోదరీమణులందరు క్షమించాలె. ‘వెలంటైన్స్ డే’ పుట్టు పూర్వోత్తరాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా ఎందుకంటే, కొద్దో గొప్పో ఈ పాటీకి మనకు తెల్వకుంటనే మన మెదడులకి ఆ సమాచారం ఎప్పుడో చేరింది. ఇదంతా మార్కెటింగ్ మహిమ అనాలో లేక, కార్పొరేషన్ల కుట్ర అనాలో మీకే వదిలేస్తున్న.

ఒక్క సారి ‘వెలంటైన్స్ డే’ గురించి కొన్ని నిజాలు చెప్పి పోదామని ఒచ్చిన (మీకు ఇదివరకే తెలిసి ఉండొచ్చు, తెల్వని వాల్లకు చెప్దామని ! :). ‘గ్రీటింగ్ కార్డ్ అసోసియేషన్’ వాల్ల అంచనను బట్టి, ‘వెలంటైన్స్ డే’ సందర్భంగ సంవత్సరానికి ఒక బిలియన్ (వంద కోట్లే గద!) కార్డులు అమ్మకమైతయి. క్రిస్మస్ తరువాత ‘వెలంటైన్స్ డే’ కే ఆ ఘనత దక్కుతది, (క్రిస్మస్ అప్పుడు 2.6 బిలియన్ అంట). 85% ‘వెలంటైన్స్ డే’ సరంజామాల కొనుగోలుదారులు మల్ల స్త్రీ లే నంట, ఇది తెలిసినంక మార్కెటింగ్ వాల్ల కపట మస్తిష్కాల్ల ఎన్ని కుత కుతలో?

ఒక్క కార్డుకు సగటున 5 డాలర్లు ఏసుకున్నా (ఒక్కో కార్డు 0.5 – 10 డాలర్లు ఉంటుంది అన్న, ‘గ్రీటింగ్ కార్డ్ అసోసియేషన్’ వాల్ల అంచనను బట్టి), ‘వెలంటైన్స్ డే’ గ్రీటింగ్ కార్డ్ ల అమ్మకాల మీద సంవత్సర ఆదాయం దాదాపు 500 కోట్ల డాలర్లు / 22000 కోట్ల రూపాయిలు (అంతేనా !). అయితె ఈ అంకెలొచ్చి అమెరికాలవి మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగ ఎంత సొమ్ము చేస్కుంటున్నరో ఆలోచించండి? అయితే ఈ ఆదాయం ఒక్క గ్రీటింగ్ కార్డుల మీద మాత్రమే ఇంత ఉంటే మిగితా (టెడ్డి బేర్లని, పర్ఫ్యూమ్లు, వగైరా వగైరా…) సరుకు సరంజామలతోటి ఇంక ఎన్ని లక్షల కోట్ల ఆదాయమో ఒక్క సారి ఆలోచించండి.

ఇవ్వన్నీ లెక్కలు ఎందుకు చెప్తున్నడు, పొద్దున్నే తాగొచ్చిండా వీడు? అంటె… నేను కాలేజీ రోజుల నుండి అమ్మయిలు ఎవరు ‘ఊ’ అంటరా ఓ గులాబి పువ్వో, కార్డో (తెలుపు, గులాబీ కాదు… పచ్చది అంతకన్న కాదు) ఇద్దామని ఉత్సాహ పడ్డోన్నే. [ఇంకా పడుతున్నరా ! అని అడుగుదామనుకుంటే. లేదు భయ్! ఒక నాలుగేళ్ల కిందనే నా ప్రేమ ఫలించింది కాబట్టి ఇప్పుడు ఆ చాన్స్ లేదన్నట్టే. చాన్స్ లేదు కాబట్టేనా ఈ (వెలంటైన్స్) గీతా బోధ అనుకోవొద్దు]. ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరంలేదు కాబట్టి ఆలోచిస్తున్ననా.. ఏమో! మొత్తానికి ఆలోచన వచ్చి కొంచం శోదిస్తె తెలిసిన విషయాలే మీతో పంచుకుందామని వచ్చిన.

ఖర్చు పెట్టె వాడి ఇష్టం.. అంటె అది సరైనా సమాధానం కాకపోవొచ్చు. అమెరికాలో ఉంది అట్లా మన దగ్గర లేదు అని అనుకునే అవకాశమే లేదు. ఎందుకంటే 1980లోనే ప్రపంచీకరణకు మన దేశం తలుపులు తెరుచుకొను కూర్చున్నది (పూర్తిగా అటుదిక్కు వెల్లకుంట మాట్లాడుకుందాం :), చివరి పదేల్లల్ల, సినిమాల భూతం చాలదన్నట్టు ‘వెలంటైన్స్ డే’ కూడ మన ధేశంల దాపురించింది. కంపనీలకు కావాల్సింది, లాభాలు ! వాటి కోసం రేపు తద్దినాలను కూడ మార్కెట్ చేసినా దిక్కులేదు. ఇప్పటి వ్యవస్థల అమెరికా ఏంచేసినా, అక్కడ ఏం జరిగినా ప్రపంచ వ్యాప్తంగ అందరు అనుభవించాల్సి వస్తది (ఇప్పుడు సుఖాలైనా, రేపు మాత్రం దుఃఖాలే !)

[ఇక్కడ చిన్న విషయం చెప్పలె, ఎప్పుడొ ఒక ఆడ్ చూసింది గుర్తొచ్చింది, “మీరు, చనిపోయినంక మీరు ఇష్టపడె విధంగ, కావల్సినంత ఖర్చుపెట్టి మీ వాళ్ళు మీకు ఫ్యూనరల్ చెయ్యలేక పోవొచ్చు. ఇప్పటి నుండె మీరు నెలకు అతి తక్కువ రుసుము చెల్లిస్తే 5000 నుండి 10,000 డాలర్ల ఫ్యూనరల్ పాకేజీను మీ సొంతం చేస్కోండి” అని. బతికి ఉన్న వాల్లకు చావును మార్కెట్ చేస్తున్నరు. రేపు కాక పోయినా ఇట్లాంటియి ఇంకో 10-20 సంవత్సరాల్ల, మన దేశంల కూడ చూస్తమేమో]

ఇష్టమైన వాల్ల మీద ప్రేమ వ్యక్తపరచాలంటె వాల్లకు కార్డులు / కానుకలు కొనాల్సిన అవసరంలేదు., అది కూడా సంవత్సరంల ఒక్క రోజు చెప్పేస్తే అయిపోతదా? అరగంట కాక పోయినా రోజుకు ఒక 5 నిమిషాలన్నా (పెల్లయిన వాల్లు / ప్రేమికులు) మీ సహచరులను ఒడిలోకి తీసుకుని ఎంత ప్రేమిస్తున్నారో వ్యక్త పరచండి అంతే చాలు. సంవత్సరం మొత్తం వంటింటి కుందేలు లెక్క చూసి ఈ ఒక్క రోజు పువ్వులో చాక్లెట్లో కొనిచ్చినంత మాత్రాన ఆ గుండె నిండది. Heart

Once again, Happy Valentines Day !

(రెండో భాగం చదవండి)

PS: if you’re, curious GOOOOOOO0000000oooooooooooooooooooooooGle !Anti-Valentine’s Day’ for more

* ‘వెలంటైన్స్’ అన్నా ‘వాలెంటైన్స్’ అన్నా, దానికొరిగేదేమి లేదనుకుంట, దాన్ని కాష్ చేస్కునే వాల్లు ఎట్ల చేస్కోవాలనుకుంటె అట్ల చేస్కుంటరు.


Responses

 1. ఈ ‘వాలెంటైన్స్ డే’ ని మార్కెట్ చేసి కాష్ చేస్కుంటున్న వాళ్లు ఒక వైపు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయంగా కాష్ చేస్కోవాలని చూసే మత ఛాందసవాదులు ఇంకో వైపు బయలుదేరినరు. దానిని ఎట్లా మార్కెట్లు కాష్ చేసుకుంటున్నాయో తెలియజేయడం మంచి పనే, అందరూ హర్షించదగ్గ విషయం. అక్కడితో ఆగితే బాగానే ఉంటుంది. కాని ‘బజ్ రంగ్ దల్’ నేతలు, కార్యకర్తలు బయలుదేరి పార్కుల వెంబడి ప్రేమికుల కోసం గాలిస్తూ, దొరికిన వాళ్లకి బలవంతంగా పెళ్లిల్లు చేయడం వాళ్ల వికృత మనస్తత్వాలని బయట పెడుతుంది. పెళ్లి వంటి ఒక వ్యక్తిగత, జీవితాంతం కట్టుబడి ఉండాల్సిన నిర్ణయాన్ని, రోడ్లపై కనబడిన జంటలపై బలవంతంగా రుద్దడం వాళ్ల మత మౌఢ్యం ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తుంది. బలవంతపు పెళ్లిలను టి.వి లో ప్రసారం చేసినా వాళ్లని అడ్డుకునే, ప్రశ్నించే దిక్కు లేదు. వీళ్లకి సంస్కృతి మట్టి పాలు అవుతుంది అని నిజంగా అంత బాధగా ఉంటే పల్లె జీవితాలు, సంస్కృతులను ఛిన్నాభిన్నం చేస్తూ, ఎందరో రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న గ్లోబలైజేషన్ కి వ్యతిరేకంగా కొట్లాడవచ్చు కదా! అక్కడ మాత్రం ‘India Shining’ అని గ్లోబలైజేషన్ ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలకి వంత పాడుతారు.

 2. Happy Valentines Day. Nice Write up
  Worth reading

  —–Kiran

 3. మాబాగా సెలవిచ్చారు. అస్సలు ఈ రోజుల్లో అన్నీ వ్యాపారాత్మకమే…అన్నట్టు క్రిస్మస్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడిక్కడ క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు కాదు కానీ శాంటాక్లాస్ (ఓ కార్టూనిస్ట్ ఊహల్లో జనించిన పాత్ర మాత్రమే) రుఢాల్ఫ్, బొమ్మలదే హవా! ఎందుకంటే పేదల్ని ప్రేమించు, అట్టడగు వర్గాలకు చేయందించు అన్న క్రీస్తు భోదలు పైసలు రాల్చవు కదా అందుకు! ఏదేమైనా ప్రేమకు కాకపోయినా ప్రేమికులకంటూ ఓ రోజు ఉందని అల్పానందం పొందొచ్చు. సక్కంగా సెప్పిన్నావన్నా!

 4. hey ! it was really a nice write up.
  i think if u really love some one u dont have to wait all the year to say it to them .you can make everyday a special day instead.

  and another point is the changing life style in hyd/banglore and places around in india.The
  malls,pvr’s,imax,central etc are makin a lot of money on movies.each show may cost from
  RS.130-650.The youth and people who are into the IT field these days get a gud package but they are gettin addicted to this kind of lifestyle
  but that gud package isnt jus enough for them to enjoy this tempting lifestyle.they might not be running into debts directly but the credit cards
  and the banks wud take care of it .
  hey so plan how to spend ur money!

 5. ఇప్పుడు ప్రతీదీ వ్యాపారాత్మకం అయిపోయింది.జనవరి 1,ప్రేమికుల రోజు,మదర్స్ డే.ఇండియా లో త్వరలో ఇంత విస్త్రుతం అయ్యే మరికొన్ని డేలు…వుమెన్స్ డే,ఫాదర్స్ డే,థాంక్స్ గివింగ్ డే …..వీటన్నిటినీ వెలుగులోకి తెచ్చేది టీవీ వాళ్ళు,గ్రీటింగ్ కార్డుల వాళ్ళు.

 6. కాదేదీ మార్కెట్ కనర్హం! వెబ్ ప్రపంచం లోకి కొంచెం డీప్ గా వెళితే… అబ్బో నగిషీలు చెక్కిన శవపేటికలు, మనుషులకు కూడా లేనన్ని పిల్లులు, కుక్కల వస్తువులు…

  అలవాటు లేని దాన్ని అలవాటు చెయ్యడం. తత్ఫలితంగా మానసికమో, శారీరకమో ఒక వ్యాధి వస్తే మళ్లీ ఇంకొన్ని ఉత్పత్తులు అమ్ముకోవడం.

  అన్నిటికన్నా పెద్ద మార్కెట్ అయిన యుద్ధాన్ని రావణ కాష్టం లా నడపడం

  ఒక్కటా… రెండా…

  గ్లోబల్ మార్కెట్ వికృత చేష్టలు…

 7. meeru oka sari naa latest post on conventions choodalandi… meeku kuda oka point undi andulo

 8. మీ భాష, భావం చాలా బాగుంది.

 9. Chaala baagundhi


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: