Posted by: JayaPrakash Telangana | June 28, 2008

గమ్యం చేరినమా ?

“ఒక కవిత సదివితె ఉల్లిగడ్డ పొరల లెక్క, సదివిన ప్రతిసారి ఒక కొత్త భావం వస్తె అది మంచి కవిత్వానికి ఒక చిహ్నం” చాన రోజుల కింద ఒక సోదరుడు అన్న ఈ మాటలు యాదికొస్తున్నయి… ఇది సినిమాలకు కూడ వర్తిస్తదని నేను అనుకుంటున్న, ఎందుకంటె సినిమా కూడ ఒక కళారూపమే గనుక.

అయితే చాల కాలం తరువాత మనసుల కొంత ఆలోచన రేపే ‘తెలుగు సినిమా’ “గమ్యం” చూసిన. మూడు ఫైట్లు, ఆరు పాటలు, పన్నెండు కామిడీ సీన్లు, ఇరవైనాలుగు పవర్‌ఫుల్ (అనబడే బూతు) డైలాగులు అన్న సందంగ మాత్రం రివ్యూ రాయాలనేది నా ఉద్దేశం కాదు (వాటి కోసం ఖాళీ మెదడులు అనబడే సైట్ల చాన ఉన్నయి). సినిమా చూడంగనే వచ్చే మొదటి అనుభూతి (స్పందన / first impression) ; చూసి బైటికి రాంగనే ఆ సినిమా నాలోపల రేపిన నాలుగు ఆలోచనలు మాత్రమే పంచుకుంట.

దున్నపోతు మీద వ్యాసం రాసినట్టు. ప్రేమ కథ, లేకపోతె మాఫియా / ఫాక్షనిజాలు తప్ప ఇంక కథలే లేనట్టు / దొరకనట్టు వస్తున్న తెలుగు సినిమాల క్రమంల “గమ్యం” ఒక కొత్త అనుభూతే (మలుపు కూడ కావొచ్చు/ అందుకే చానమందికి నచ్చింది అనుకోంరి). ప్రేమకథ ఉన్నా ఒక కారెక్టర్ జర్నీ (character journey)ని ప్రధానంగ ఎన్నుకొని కథ రాయగలిగినందుకు “క్రిష్”ను మెచ్చుకోక తప్పదు.

ఒక కథ రాసేటప్పుడు ఆ కథల ఖచ్చితంగ ఆ కథకుని ఆలోచనలు (reflect) ప్రతిబింబిస్తయి, “గమ్యం” తోటి క్రిష్ ఆలోచనలుగూడ తెలుస్తయి. ఆడోల్లంటె సినిమాలల్ల పాటలకో విలాస వస్తువు లెక్కనో తప్ప పనికి(లేని)రాని ఈ తరం (తెలుగు) దర్శకులకు భిన్నంగ నగేష్ కుకునూర, శేఖర్ కమ్ముల దారిలనే, ‘స్త్రీకి ఒక అస్థిత్వం ఉంటద’న్న రీతిల కమలినీ పాత్ర తోటి తెలుస్తది. అట్లనే ప్రపంచంల రోజువారి జీవితంల సగటు మనిషి చేసే సంఘర్షణలు వేరేయిగూడ ఉంటయని (గాలిసీను / అభిరామ్) పాత్రలతోటి చెప్ప ప్రయత్నించిండు. నిజమే ‘కార్ కిటికీల నుంచి కనిపిచ్చేది కాదు అసలైన జీవితం’.

అయితె ఈ మద్యకాలంల ఎక్కువగ కనిపిచ్చేది, ఇనిపిచ్చేది ‘ఛే’ (Ernesto ‘Che’ Guevara) గురించి, ‘ఛే’ మీద అభిమానం గురించి. ‘ఛే’ రాజకీయాలు ఏవయినా ఆయిన ప్రజల కోసం తన జీవితాన్ని (most / rest of his prime life) త్యాగం చేసిండు. ‘ఛే’ మీద అభిమానం / ప్రభావం తోటో ఆయిన జీవితం గురించి తెలుసుకున్నంక నిస్వార్థంగ ఏదన్న ఒక్క మంచి పని చేయాలనిపిస్తది ( / చేసినంకనే సచ్చిపోవాలనిపిస్తది). ఆ మనస్తత్వంతోటి ‘గాలి సీను’ పాత్ర మల్చబడ్డట్టు వ్యక్తమైతది. అయితె కథ అడవులల్లకు పోయి నక్సలైటు పాత్రలకు ఎదురు పడకుంట ఇంకో తీరుగ (…ఎవరో ఫాక్షనిస్ట్ / politician విలన్‌ను… పెట్టి జీవితంల సంపుకునుడు కన్న ఇంకవేరె పనులు కూడ ఉన్నయని తెలిశేటట్టుజేసి… విలన్ మనసు మార్చి, ఒక మంచిమనిషిని చేసి.. అదే ప్రయత్నంల అభిరామ్ పాత్ర మారినట్టు…) గూడ సినిమా పూర్తి చెయ్యొచ్చు. కని క్రిష్‌కి ‘అన్నల’ పట్ల ఒక అభిప్రాయం ఉంది ‘వాళ్ళు మంచి ఉద్దేశం తోటే తుపాకులు పట్టి ఉండొచ్చు, కని ఆ మంచేదో జనం మద్యకి వచ్చి చెయ్యొచ్చని’ అదే క్లైమాక్స్‌గ రూపుదాల్చినట్టు ఉంది.

అయితె అడివిల ఒక కామియో (cameo) తోటి వచ్చి పెద్దన్న / అన్నల పెద్ద, కోవర్ట్‌ల తోటి ఒక (point of view) ముందు పెడ్తడే తప్ప ఒక వాదన (healthy debate / short discussion) మాత్రంకాదు. సరే ఈ మాత్రం అన్న చేసిండు అంటరా ?!! :) . అందరికి ఆలోచనలు ( / point of views) ఉంటయి. అవి personal platforms మీద ఎట్లన్న వ్యక్తంజేసుకోవచ్చు, కని ఇట్ల broader platforms మీద present చేసినప్పుడు, కనీసం రెండు వైపుల వాదనలను సరిగ్గ ముందు పెట్టగలగాలె, పెట్టాలె !

గాలిసీను బడికి పోయేటప్పుడు, అమ్మ సచ్చిపోయినప్పుడు (…వగైరా…ఇంక గుర్తుచెయ్యని ఎన్నోసార్లు) ‘అన్నల’కోసం ఎదురుచూపులు చాన భావోద్విఘ్నంగ చూపిచ్చిండు. ప్రభుత్వం చెయ్యాల్సిన వాటికన్న చెయ్యగూడని పనులెన్నో చేస్తుందని అడవుల్లకు పొయ్యి (సరైన నిధులు వసతులు లేక, మంచో / చెడో) ఏదో ప్రయత్నిస్తున్నరు అన్నలు., అసొంటోల్లు వచ్చి నిన్ను వ్యక్తిగత కష్టాల నుంచి ఎట్ల ఆదుకొమ్మంటవు. మరి అవసరానికన్నా అన్నీ ఎక్కువుండీ ఏం చెయ్యని ప్రభుత్వాన్ని ఏం నిలదీస్తున్నం ?

‘గోదావరి’ అంటె భద్రచలం / రాజమండ్రిల మొదలయ్యి బంగాళ ఖాతంల కలుస్తదన్నట్టు, పట్నం(హైదరాబాదు)ల మొదలయ్యి కర్నూలు, అమరావతీ మీదినుంచి దండకారణ్యం దాంక జరిగిన ప్రయాణంల ఎందుకో ఎక్కడగూడ తెలంగాణ తగులదు. బస్సులు, కార్లు, రైల్లు అన్నీ ఇక్కడి (ఖాజీపేట్, వరంగల్, డోర్నకల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్) ఊర్లను తాక్కుంట పోయెటప్పుడు పర్దాలు ఎసుకున్నందుకేమో ! (ఇక్కడ కార్ కిటికీ బైటి నుంచి చూడలేక పోయిండు ఎందుకో?) చూపించినంత వరకు సీమాంధ్ర ప్రజలను గ్లామరైజ్ చెయ్యకుంట చూపించినందుకు మెచ్చుకోక తప్పదు. అయితే ఆంధ్రల ప్రజాజీవనాన్ని సూపించనీకి టూరింగ్ టాకీస్‌లే కాకుంట ఇంక చాన ఉన్నయి / subject పరంగ, entertainment, comedy factors కోసం neglect చేయబడ్డయి.

Overall not a bad movie from a debutant director ! Good luck on your future ventures. As audience with appetite for good movies lets expect many more better movies from Krish !


Responses

 1. మంచిగ జెప్పినవన్నా, కానీ, ఒక్క సిన్మలా అదీ మొదటిసిన్మలో ఆన్నీ బ్యాలన్సుగా సూపించుండాలనే ఆశ మనకాణ్ణుంచీ తప్పుగదే? ఏదో అప్పుడే అమెరికనుంచొచ్చి తన సేతనైంది చేసిండుగదా!మామూలుగా తీసే చెత్తకన్నా కొంచం మంచి విషయమున్న కథ గాదె ఇది?

  ఇంగ అన్నల గురించంటావా…అదొక యాంగిల్ లో శొచాయించాడు. దాన్ని ఒప్పుకునే నాలాంటోళ్ళు చాలా మందున్నార్ భాయ్.

 2. మహేష్ భయ్ !
  నేను అనేది గూడ అదే, సినిమా బాగ తీసిండు., నువ్వు నేను తీసినా అంత బాగ తియ్యలేము ఏమో. మొదటిసారి సినిమా తిసెటప్పుడు కొన్ని విషయాలు మరుస్తం, క్రిష్ ignore చేసిన విషయాలను నేను ప్రస్తావించిన అంతే.

 3. రికార్డింగు డాన్సుల ప్రహసనం ఫేమిలీ ఆడియన్స్ ని కొద్దిగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం.ఆ పదినిమిషాలు చాలామంది అసహనంగా,ఇబ్బందిగా ఫీల్ అవ్వడం నేను గమనించాను.ఇంత మంచి సినిమాలో ఆ ఒక్క సీన్ లేకుండా ఉండివుంటే ఇంకా బాగుండేది అనిపించింది.

 4. please remove this black background!

  very very tough to read.

 5. Thanks Kiran, duly noted !

 6. నమస్తే అన్నా
  గమ్యం సినిమా ఫర్వాలేదే. గా మాత్రం తీసెటోళ్ళు మాత్రం యాడున్నరు చెప్పు. తీసెటోళ్ళు తీసినప్పుడన్న చూసెటూళ్ళు చూడట్లే కదనే.

  మనిషి అస్తిత్వ మూలాలను మరచి ఎంతదూరం పోయిండో హీరో పాత్రలో బాగా చూపించాడు. దాన్ని తెలుసుకోవడమే తనని తాను తెలుసుకోవడమనే భావనను ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు క్రిష్ కృతకృత్యుడయ్యాడు.

  సత్యమే శివం అనే సినిమా చూసినారే మీరంతా. కమలహసన్,మాధవన్ నటించారు. అదికూడా చాలామంచి సిన్మా. కదిలిస్తుంది. గమ్యం సినిమా చూశాక నాకు సత్యమే శివం గుర్తుకొచ్చింది. దానికి దీనికీ కథలో పోలికలేమీ లేవు. ఉన్న పోలికల్ల మానవ అస్తిత్వ సంవేదనలు మాత్రమే.

 7. అన్నాసీతారాంరెడ్డి !
  ఇప్పుడు వచ్చే సినిమాలకు పోలిస్తె క్రిష్ ఏసిన అడుగును మెచ్చుకుంటనే, సినిమా గ్రామర్ / perspective, current struggles / issues, దృష్ట్యా ఇంక ఏం చేస్తె బాగుండేదనే ఉద్దేశం మాత్రమే చెప్పిన కని, ఇట్లాంటి మనోభావాలున్న యువ దర్శకులను discourage చెయ్యాలనేది ఎంత మాత్రం కాదు.

  ‘సత్యమే శివం’ మంచి సినిమానే కని దానికి దక్కవలసిన credit దానికి దక్కలేదు, కారణాలు ఏవయినా, తప్పకుంట సినిమా చూసే మనలాంటి సామాన్య ప్రేక్షకుని ప్రేరణ, ప్రోద్బలం కూడ మంచి సినిమాలు నిర్మాణం అవనీకి ఖచ్చితంగ దోహదం చేస్తయి అని నేను అనుకుంటున్న !

  Thanks much for Sharing your thoughts ! please keep writing !

 8. […] గమ్యం చేరినమా? అంటూ గమ్యం సినిమాపై తన స్పందనని జేప్స్ తెలియజేస్తున్నారు. […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: