, , , ,

మూడు కలలు : ఒక గొడ్డలి

ప్రవీన్, నేను, తివారీ బయిటికొచ్చినం, అంత మామూలుగనే అనిపిచ్చింది. ముగ్గురం చాన ఎక్సైటెడ్‌గ ఉన్నం, ఓ అర మైలు నడిసినంక ఇద్దరు పోలీసోల్లు పక్క బండి కాడ ఆగి చాయి తాగుత కనిపిచ్చిన్రు. ఇంక కొంచెం దూరం పొయ్యినంక రోడ్డు పక్కన చెట్లల్ల లైట్లు ఆఫ్ చేస్కొని ఒక జిప్సీ ఆగుంది, కదులుతున్న నీడలు, ఎవరో ఉన్నరక్కడ అన్న సంగతి అర్దమైంది. అప్పుడన్నడు ప్రవీన్ “… గిరీష్ గుర్తుండు గద తివారీ ! తొందర్లనే మనం వాన్ని…

ప్రవీన్, నేను, తివారీ బయిటికొచ్చినం, అంత మామూలుగనే అనిపిచ్చింది. ముగ్గురం చాన ఎక్సైటెడ్‌గ ఉన్నం, ఓ అర మైలు నడిసినంక ఇద్దరు పోలీసోల్లు పక్క బండి కాడ ఆగి చాయి తాగుత కనిపిచ్చిన్రు. ఇంక కొంచెం దూరం పొయ్యినంక రోడ్డు పక్కన చెట్లల్ల లైట్లు ఆఫ్ చేస్కొని ఒక జిప్సీ ఆగుంది, కదులుతున్న నీడలు, ఎవరో ఉన్నరక్కడ అన్న సంగతి అర్దమైంది. అప్పుడన్నడు ప్రవీన్ “… గిరీష్ గుర్తుండు గద తివారీ ! తొందర్లనే మనం వాన్ని కలుస్తం ! ”

* * *

హీత్రో ఏర్‌పోర్ట్‌ల ఆ దరిద్రపు సెక్యూరిటీ చెక్ ఒకటి, మా కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయ్యింది. ముప్పై రెండు గంటల ప్రయానం తర్వాత ఇంటికొచ్చినంక, ‘జరంతసేపు పండుకుంటనే అమ్మా!’ అన్నాగూడ ఇనిపిచ్చుకోకుంట పంపిందీ పెల్లికి. ఒక దిక్కు నిద్రొస్తుంది, ఇంకో దిక్కు నన్నెవల్లు గుర్తుపడ్తలేరు, అయిదేల్లు దాటిందిగద మరి దేశానికొచ్చి, మర్శిపోయిన్రేమో సుట్టాలు అనుకున్న.
నా ఉద్దేశంల ఓ వెయ్యి మందిని పిల్శి జేసే పెల్లయినా సరే, ఓ నలుగుర్ని ఇంటికి భోజనానికి పిలిసినా సరె అన్ని లెక్కెంబడి జర్గాలె. ఎక్కడన్న చిన్న తేడా ఒచ్చినా అవ్సరంలేని కోపంమొస్తది. ఓ.సీ.డి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) అంటది నా భార్య, కాదు అంట నేను.

గ్లాసులన్ని టేబుల్ మీద అట్ల పడేసి ఉన్నయి, డ్రమ్ముల నీల్లు లేవు, నీల్లు పోసెటోడు లేడు. ఈ ఎక్కిల్లేమో ఆగుతలేవు. “ఆ నీల్లు తాగినంక ఓ రెండు నెలలు ఈడనే పంటవు, అమెరికాకేం పోతవింక” అనుకుంటొచ్చిండు రాహుల్. “నీ కోసం బాటిల్లు తెప్పిచ్చినింగో బావ, నువ్వు ఒస్తవో రావో అనుకున్నం …” అని వాడింక ఏదో అంటుంటె, ఎవరో ఒచ్చి పల్కరిస్తె మాట్లాడుకుంట పొయ్యి చెయ్యి కడుక్కొనొచ్చి పక్కకు కూసున్న. కడుపుల అల్సర్ అప్పుడప్పుడే తగ్గుతుంది, ఇంకో వారం రోజులు ఓపిక పడ్తె బాగుండు, మటన్ కూర చూసినంక నాతోటి కాలె ఇంక. పెల్లిలల్ల మంది ఎక్కువ ఒస్తరని, జనాలు కూర ఎక్కువేస్కోవొద్దని, కారం ఎక్కువేసే మన వంటోల్ల పున్యామా అని కడుపుల అల్సర్ మల్ల లొల్లి శురూ చేసింది. నాతోటి గాక, ఇంక ఎవ్వరికి చెప్పకుంట ఆడి నుంచి బైట పడ్డ.

* * *

ఐదేల్లయింది దీపావలి సూసి, ఈ సారి ఎట్లైన పండుగకిక్కడ్నే ఉండాలని పేయిడ్ లీవ్ లేకున్నా తెగించి ఒచ్చిన. ఆటోలోల్లు సావగొడ్తున్నరు ‘సార్ ! ఆటో కావల్నా’ అని. నాకు ఆ గల్లీలల్ల ఎన్నో ఏల్లకి నడుస్తున్న సంబరంతోటి ‘నక్కో భయ్ !” అని చేతులూపి బట్టల్ బజారెంబడి నడుస్కుంట పోతున్న. బట్టల దుకాన్ల లొల్లి, స్టీల్ సామాన్ల సప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం మారలే. ఇంతల్నే ఇంతెజార్‌గంజ్ పోలిస్ స్టేషన్ కాడికి ఒచ్చేసరికి పోలీసులు అంత ఏదో ఒల్లంత చీమలు పారుతున్నట్టు లోపటికి బయిటికి ఉర్కుతున్నరు.

రాజేశ్వర్ సేఠ్‌ని కల్శి ఎన్నేల్లయింది, పొయినసారి ఒచ్చినప్పుడు వాల్లింటికి బోజనానికి పిలిస్తె గూడ పోనీకి టైం లేకుండె, ఒకసారి కనబడి పోదాం, ఫోన్ జెయ్యక కూడ యాడాది దాటింది అనుకుంట ‘కమల్ వాచ్ కో’ దిక్కు నడుస్తుంటె కొద్ది దూరంల ఓ గుంపు కనబడ్డది. బాగ తాగి ఎగురుతున్నరు అనిపిచ్చింది సూస్తె. మార్వాడోల్ల బంగారు దుక్నాలు ఎక్కువుంటయి ఇటుదిక్కు. పెల్లి బారాత్ అయితె కాదు మరెందుకు ఎగురుతున్నరో అర్దం గాక కాల్లీడ్సుకుంట ఇంకో నాలుగు అడుగులేసిన. ఆరు గంట్లకే చీకటవ్వుడు సూసి నవ్వుకుంట పోతున్న (అమెరికాలయితె ఎండ కాలం తొమ్మిది గంట్లకు, సలికాలం నాలుగ్గంట్లకు చీకటి పడ్తదాయె).

గుంపుల తెల్సిన మొకాలేవో కనిపిస్తున్నయి అనుకుంటనే ముందుకు పోతుంటె మందల రాకేష్ కనబడ్డడు. నాకు గుట్టెడు సంబరం, కోపం ఒక్కటే సారి ముంచుకొచ్చినయి. దాదాపు పదేల్లయింది వాన్ని కల్సి, వాడు సిడ్నీల నేను న్యూయార్క్‌ల ! ఇండియాకి ఒచ్చినప్పుడల్ల కలుద్దాం అని ఎన్నిమార్లు అనుకున్నా ఇద్దరీట్ల ఎవరో ఒకరి ప్లాన్‌లు మారేయి. కాలేజీ రోజుల్ల ఇద్దరం దమ్ముకొట్టుకుంట నా వెస్పా మీద చింతగట్టు, కాకతీయ కెనాల్ మీద “యే దిల్ ! దివానా ! హా హై యె దిల్ …” అని పర్దేస్ సినిమాల పాటలు పాడుకుంట పొయ్యిన రోజులు ఒక్కసారి కల్లముందు తిరిగినయి.. కల్లల్ల ఇన్ని నీల్లుగూడ.

రాకేష్, గుంపుల ఎగురుతున్నోడు దూరంనుంచి నన్ను చూసిండు. ఇండియాకి పోతున్న అని నాకు చెప్పలేదన్న బాధ, ఇన్నాల్లకు నన్ను కలుస్తున్నడన్న సంతోషం రెండు వాని మొకంల కనిపించినయి. దోస్తాన్‌ల వాని మీద ఏదో అన్‌-లిమిటెడ్ హక్కు ఉన్నోడిని కాబట్టి “సాలె ! కైకు నై బతాయారే, ఆరా బోల్కె..?” అనుకుంట వాని దెగ్గర్కి పోతుంటె “డార్లింగ్ , మేరీ షాదీ పక్కీ హోగయి రే ! ” అనుకుంట మీద పడ్డడు.

అరగంట తిర్గే సరికి, మెయిన్ రోడ్ అన్న సోయిగూడ లేకుంట ఎగురుతున్నం అందరం. అక్కడ ట్రాఫిక్ పోలిసోడు మావోడికి దోస్తే, ఎక్కడున్నడా అని సూస్తుంటె ఆయినెగూడ గుంపుల్నే ఎగురుతున్నడు (ఆఫ్ డ్యూటీ అనుకుంట?). రాకేష్‌ని సూడంగనే జెట్‌లాగ్ పోయిందో, లేకపోతె తాగిన మందు ఎక్కువైందో తెల్వది. “ఆజ్ మెరె యార్ కి షాదీ హై..” అని గట్టిగ పాటలు పెట్టుకొని ఎగురుతున్నం … అందరం.

ఒక గంట సేపైనంక ఇప్పుడే వస్తమని రాజేశ్వర్ సేఠ్‌కి (రాకేష్ వల్ల నాయిన) చెప్పి, చౌరస్తల మా అడ్డ దిక్కు నడుసుకుంట, ఆ ఇరానీ చాయి, సమోస, మిర్చీలు, గోల్డ్‌ఫ్లేక్ కింగ్‌లు గుర్తుకు చేసుకుంట అన్నీటి కన్న ఎక్కువ, అన్నేల్ల తర్వాత పాత అడ్డకు పోతున్నమన్న సంబరం ఎక్కువైంది.

* * *

చౌరస్తాకు రాంగనే, అక్కడింకేదో గుంపు కనబడ్డది. ఏమైతుంది అనడిగితె “వీళ్ళకి చెప్పే చదువులు నచ్చట్లేదంట! ఏదో విద్యార్థి సంఘం వారు దర్నాకు దిగారు. అదేంటో మేమంతా చదువుకోలా? వీళ్ళకేమొచ్చిందో ! ” అని జావాబిచ్చిన్రు ఎవరో. అదేంది ఎనబైల చివర్లనేగద విద్యార్థి సంఘాలను బ్యాన్ జేసింది సర్కారు ! మల్ల కొత్తగ ఎప్పుడు శురూ అయ్యినయి అనుకుంట అవుతలి దిక్కుకని పోతుంటె స్టూడెంట్ లీడర్ ఎవరో, ఏదో నారా ఇచ్చిండు, ఇంకేమైతది అటుసూశి ఇటుసూశే సరికే పోరగాల్లందరు అరుసుకుంట నారాలిచ్చుకుంట లొల్లి శురూ చేసిండ్రు. ఇంకిదే మంచి సందని పోలీసోల్లు లాటీలందుకొని ధర్నా జేసే జనంమీద పడ్డరు, నాల్గు దిక్కుల్నుండి. చేతుల ఇస్కను పిస్కుతె ఏల్ల సందుల్ల నుంచి బైటికి రాలినట్టు, స్టూడెంట్లందరు పోలీసోల్ల నడుమనుండి ఎటు సందైతె అన్ల నుంచి ఉర్కుతున్నరు. ఎక్కడి నుంచి ఒచ్చినయోగని, స్టూడెంట్లు కట్టెలడ్డంబెట్టుకొని ఎటోల్లటు పరారైతున్నరు.

నేనుగూడ అట్లనే జారుకుందామని సూస్తుండంగనే ఒక పోలీసోడు లాటీ ఎత్తిండు, అది పడ్తె నా తల్కాయ రెండు వక్కలయ్యేది, ఎవరో కట్టె అడ్డం పెడ్తె ఆడ్నుంచి జారుకున్న. ఒకరిద్దరు స్టూడెంట్స్ ‘పిన్నవారి’ వీధెంబడి పోతుంటె నేనూ వాల్లెంబడి ఉరికిన. ఎప్పుడు ఏడనుంచి ఒచ్చిందో నా చేతులగూడ ఒక కట్టె ఒచ్చింది, అది పట్టుకొని ఉరుకుతుంటె ఏదో గొడ్డలి పట్టుకొని ఉర్కుతున్నట్టు అనిపిచ్చింది.

జిందగీల ఇంత దూరం ఎన్నడు ఉర్కలే, అదిగూడ పోలీసోల్లు ఉరికిస్తుంటె. ఏ.వి.వి కాలేజి గ్రౌండ్స్‌ల బడి బద్రకాలి పక్క చెట్లెంబడి ఉరుకుతున్నం, ఒకరెనుక ఒకరం. అసలిటు దిక్కు ముందు ఎవరు పోయిన్రో తెల్వదిగని గొర్లమంద లెక్క అందరం ఆ కంచెలల్లబడి పోతున్నమనిపిచ్చింది. మేము సందులల్లబడి, ఇటు ముల్ల కంచెలెంబడి ఒచ్చుడు ఎవడన్న పోలీసోడు సూసి మా ఎనుక ఒస్తె ఎట్ల ? అనుకుంటున్న, అప్పుడే ఎన్క నుంచి ఎవరో ఉరికొస్తున్న సప్పుడయ్యింది. ఆ ఒస్తున్నది స్టూడెంట్ అన్న గావాలె, లేక ఏ పోలీసోడన్న గావలె ! మరి పోలీసోడు అయితె ఎట్ల? అనుకుంటుండంగనే ఆ నీడ నా పక్కకొచ్చింది. ఎల్గాల్నా ఒద్దా అని మినుకు మినుకుమంటున్న స్ట్రీట్ లైట్ ఎల్తుర్ల ఒకరి మొకం ఒకరు సూస్కొని గుర్తుపట్టినం. అరగంట కింద నా తల్కాయ్ బచాయించిన హీరో ఈననే. అంత మంచేనా అన్నట్టు ఉరుక్కుంటనే ఓ నవ్వు నవ్విండు, మంచే అన్నట్టుగ నేనుసూత తల్కాయ్ ఊపిన, ‘హాయ్! ఐయామ్ తివారీ’ అని చెయ్యి కలిపిండు.

అలంకార్ టాకీస్ ఎనుక దిక్కున్న గుట్టలల్లబడి ఉర్కుతున్నం. ఎప్పుడు బండి మీద పోకుంట ఇటు గుట్టలదిక్కు ‘అక్కడ ఏముంటది? అడివా, గుట్టలా, చెరువా?’ అన్నట్టు సూస్కుంట పోయేది. ఈడ ఎట్లుంటదో, ఇట్ల ఎరుకైతదనుకోలె ! మేం ఇంతకు ముందు ఉరికినంత స్పీడుగ ఉర్కుతలేం, అట్లని మెల్లగ గూడ నడుస్తలేము. ఎందుకంటె ఈ (పద్మాక్షమ్మ) గుట్టలల్ల, ఎప్పటికో పాట్రోలింగ్ పార్టీ తిరుగుతనే ఉంటదని మస్తు మందికి తెల్సుగన్క.

దార్ల పోతుంటె తివారీ ఎన్నో సంగతులు చెప్తుండె. వాల్ల తాత ముత్తాతలు మహారాష్ట్ర అవుతలెక్కడి నుంచో తిరుక్కుంట వలసొచ్చి, ఒరంగల్ల సెటిల్ అయింరంట. సీ.కే.ఎమ్ కాలేజిల డిగ్రీ దాన్క సదివిండంట. వాల్ల బాపు, ముప్పై ఏల్ల కింద ఆయిన సీ.కే.ఎమ్‌ల సదివే రోజుల్ల అప్పటి పరిస్తితులు, అప్పుడు వాల్ల పంతులొకాయినె ఉపన్యాసాలు ఇన్న స్టూడెంట్లు ఎంత మంది ఎట్ల మారిన్రు, ఆరోజుల్ల స్టూడెంట్లు ఎట్ల సామాజిక, రాజకీయ విషయాలల్ల పాల్గొనేది, అప్పటికి ఇప్పటికి ఏమేం మార్పులు, ఎట్లెట్ల ఒచ్చినయో, అన్న సంగతులు ఇంటున్న కొద్ది తివారీల మెల్లమెల్లగ మార్పు ఎట్ల ఒచ్చింది. కొన్నేల్లకు ‘వరంగల్ విద్యార్థి సంఘం ’ ఏర్పడ్డంక దాంట్ల చేరి, ఇప్పుడు స్టూడెంట్ లీడర్ ఎట్లయ్యిండో చెప్పిండు.

“విద్యా బోధనా పద్దతులు, విద్యా బోధనల ప్రాంతీయ భాషల వాడకం ” మీద ఆ రోజు ధర్నాకు ‘విద్యార్థి సంఘం’ పిలుపునిచ్చిందని తివారీ చెప్పిండు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌ల రాత్రి తొమ్మిది గంట్లకు స్టేట్ లెవెల్ మీటింగ్ ఉందని, వరంగల్ చౌరస్త నుంచి బైల్దేరి హన్మకొండల మీటింగుకి ఒద్దామనుకుంటుంటె కత మొత్తం అడ్డం తిర్గిందన్నడు.

అప్పటికే ఒక గంటన్నర ఉరికినం, కాల్లు హూనమైనయి. మెల్లగ బ్రామ్మన్ వాడకు చేరినం ఇంకో ఇర్వై నిమ్షాలల్ల గార్డెన్స్‌కి చేరుకుంటం అనంగ ‘అసలు నేనెందుకు ఈ గుంపులకొచ్చిన, రాకేష్ ఏమైండు, లాటీ చార్జ్ నుంచి బైట పడ్డంక ఏ ఆటోనో తీస్కొని సక్కగ ఇంటికి పోక, ఇట్లెందుకు ఉరుకుతున్న, యాడికి పోతున్న?’ అని ఎన్నెన్నో ఆలోచనలు మెదట్ల తిరుగుతనే ఉన్నయి, మా అడుగులు ముందటికి పడ్తనే ఉన్నయి.

మీటింగ్ దెగ్గర్కి పోంగనే ఫ్లడ్ లైట్ల ఎల్తుర్ల నల్బై యాబై అడుగులెత్తు లేసిన దుమ్ము కనబడ్తుంది. బైట బందోబస్తు అయితె బాగనే ఉన్నట్టనిపిచ్చింది. వరంగల్ చౌరస్తల అయిన లొల్లికి వీల్లకి ఏం సంబంధం లేదన్నట్టు ఇక్కడి పోలీసోల్లు వాల్ల పని వాల్లు చేస్కుంటున్రు. ఏదైతె అదైతదని లోపలికి పోతుంటె “యాడికి పోయినవ్రా భయ్ ! ” అనుకుంట ఎదురైండు ప్రవీన్, తివారీకి మంచి దోస్తట.

లోపలికి పొయ్యే సరికి ఇస్క పోస్తె రాలనంత జనం, ఒచ్చిందంత మల్ల స్టూడెంట్లే ! సిన్మా వందరోజుల ఫంక్షన్‌లల్ల తప్ప కనబడని ‘యువత’ ఈడ కనిపిచ్చింది, ఐదేల్ల కిందికి ఇప్పటికి ఎంత మారింది అనుకున్న. మీటింగ్ ఇంక మొదలు గాలేదుగని ఒచ్చిన జనం అంత మైక్‌లల్ల ఒస్తున్న జానపదాలు పాడుకుంట పదం తొక్కి ఆడుతున్నరు. వాల్లల్ల మేము ఒక్కటైనం. మెడ పైకెత్తి సూస్తె తిరిగే సుక్కలు ఎక్కడియక్కడే ఆగి మా ఆట సూస్తున్నట్టనిపిచ్చింది.

* * *

మీటింగ్ బాగనే అయితుంది. ఇంకో అరగంటల అయిపోతదనంగ ప్రవీన్, నేను, తివారీ బయిటికొచ్చినం, అంత మామూలుగనే అనిపిచ్చింది. ముగ్గురం ఓ అర మైలు నడిసినంక ఇద్దరు పోలీసోల్లు రోడ్డు పక్క బండి కాడ ఆగి చాయి తాగుత కనిపిచ్చిన్రు. చేతులేదో వజనున్నట్టనిపిస్తె అప్పుడు సూసిన, అంత సేపు నేను మోస్తున్నది కట్టె కాదు గొడ్డెలని, తివారీకి చెప్పిన ఇదెప్పుడు నా చేతిలకొచ్చిందో తెలుస్తలేదని. ఎందుకైనా మంచిది ఇంటికి పోయేదాక ఎంట బెట్టుకుందాం అనుకున్నం. ఇంక కొంచెం దూరం పొయ్యినంక రోడ్డు పక్కన చెట్లల్ల లైట్లు బంద్ జేస్కొని ఒక జిప్సీ ఆగి కనిపిచ్చింది, కదులుతున్న నీడలు ఎవరియో కాదు, మఫ్టీల ఉన్న స్పెషల్ బ్రాంచోల్లు అన్న సంగతి మాకు జల్దే అర్దమైంది. అప్పుడన్నడు ప్రవీన్ “సచ్చిపోయిన గిరీష్ గుర్తుండు గద తివారీ ! తొందర్లనే మనం వాన్ని కలుస్తం ! ”

రెండు గంటలకింద భద్రకాళి చెరువు గట్టున మొసతీర్సుకోనీకి కూసున్నప్పుడు తివారీ చెప్పిండు. సంవత్సరం కింది, గిరీష్ వరంగల్ స్టూడెంట్ లీడర్‌గ ఉన్న రోజుల్ల, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలల్ల బీ.సి, ఎస్సీ-ఎస్టి కోటా సీట్లు అమ్ముకుంటున్నరనీ, అందుల విద్యామంత్రి పుల్లా రావుది పెద్ద చెయ్యి ఉందన్న విషయాన్ని బయిట పెట్టుడుతోటి గిరీష్ అందరి కండ్లల్ల పడ్డడు. మంత్రి మనుషులు తివారీ ఇంటి మీదికొచ్చుడు, బెదిరిచ్చుడు అంతా అయినయి, కొద్ది రోజులకి ఇంక సల్లబడుతుందనుకున్న టైంల గిరీష్ వాల్ల అక్కను సూశిరానీకి ములుగుకని పోయి, తెల్లారి రోడ్డు పక్క శవమైతేలిండు.

దబ దబ నడుస్కుంటనే ప్రవీన్ అన్నడు “ములుగు పోయేముందు మండిబజార్ల చాయి తాగుతుంటె గిరీష్ అన్న ఆఖరి మాటలేందో ఎర్కెనా? … చెట్లల్ల నీడలు కనబడ్తె, ఎన్కకు మర్రిసూడకుంట ఉర్కున్రి అని ! ”

దెబ్బకి ముగ్గురం గుట్టల దిక్కు ఉరుకుడు మొదలు పెట్టినం, జిప్సీ రోడ్డెక్కిందన్న విషయం లైట్ల ఎల్తురు కనబడంగనే అర్దమైంది. వాల్లు మా ఎనుకాల్నే ఒస్తున్రన్న సంగతి తెల్వనీకి ఎక్కువ టైం ఏం పట్టలే ! బండి దెగ్గెర్కి రానే ఒచ్చింది. దొర్కితె ఎదో ఒకటి చెప్పి తప్పిచ్చుకోవొచ్చు, గొడ్డలి తోటి దొర్కితె అవుస్రం లేని విషయాలకు సంజాయిశీలు చెప్పుకోవాల్సొస్తది అనిపిచ్చి గట్టిగ గుట్టల దిక్కు ఇసిరిన.

* * *

పెద్ద సప్పుడైంది !

అది రాల్లను తాకి గొడ్డలి జేసిన సప్పుడా? కల చెదిరి దెబ్బకు లెసేసరికి తల్కాయ గోడకు కొట్టుకున్న సప్పుడా అర్దంగాలె. గడియారం దిక్కుసూస్తె 4:23 అని నంబర్లు ఎర్రగ చీకట్ల మెరుస్తున్నయ్.

* * *

(ఇది 19 అక్టోబర్ 2006 , తెల్లారిగట్ల 4:23 నాకొచ్చిన కలకు ఒక అక్షర రూపం మాత్రమే)

If you liked this also read తెలంగాణవాదం ఇంట్ల నుండి శురుగావలె !

Tags:

Responses to “మూడు కలలు : ఒక గొడ్డలి”

  1. radhika

    baagundandi mee kala. konni konni chotla naaku bhasha ardamkaaledu.kaani chadavadaniki bhale anipimchimdi.

  2. chavakiran

    baaguMdi

    naaku ayitE chadavaDaaniki koddigaa kashTaMgaa unnadi.

  3. bharath bhushan

    office poyyemundhu choosina. mundhu naalugu maatalinnanka, inka koddhiga chaduvudhaamani pinchindhi. motham chadivina. ina buddahhyetlu cheppinavu. cheppoina teeru cheppina sangathi rendoo baagunnayi. madhyala vadhalabuddhi kaale.
    bhaasha kooda warangalla innatle undhi. ‘saale kaiku nai bathaaye re aara bholke’ ani pakkana nadishetodu evaro vaani dosthunu adiginatle unnandhi. manonni choodanganey tannukochina maatallekkaney

    sandhulalla polecellonunchi urikinatte katha urikindhi. urukuthunte madhya madhyala aa sandhulalla saagina patha charithra antha kandla mundhukochinidhi. KC Canal pakkana, chintagattu nunchi atu pakkana kaali jaagalalla kalsi tirigina gnapaakaalu kandla mundhu nilabaddatle warangallukunna cheekati charitra gooda dostula maatallalla vandha saarlu manolla bathuku mallokasaari kanpinchindi. chetlalla needalu kanpadithe girish maatalu! galli gallila girishlu!!
    amazing narration
    of fleeting thoughts just like the histiry that is unfolding every moment before us. chetla needalu kadhuluthunnayi, avunud, kani inka entha dhooram urkuthamu? thought provoking and makes us address the reality. that was a dream or a nightmare in the story. but that is life in our villages and that is reality. sad reality of our land today.
    the story haunts.

    just a couple of comments to excercise a little caution, if only it applies. baasha akkadakkada kontha veruganipinchindhi. naaku telvaka povachu kooda. i may be wrong. naa ‘bhaarya’, ‘enabhay chivarlenaagadhaa’ atla akkadakkada maatalu verugunnayanispistadhi.

    over all its great. it just took me to warangal. and the recent visit to KC Canal and the surroundings. and the dissolving dreams

    i know the how tough it is to speak or write the language we lived with.

    Excellent! Japes keep writing

  4. సుధాకర్

    చాలా బాగుందండి. నాకు మాండలికం అర్ధం కావటానికి కొద్దిగా సమయం పట్టినా అది విలువైనది అనిపించింది.

  5. vanaja

    బావుంది Japes.

    నీకు కథ చెప్పే ఒడుపు ఉంది.

    keep writing stories. i did not expect such a perfect story when started reading it. all the best!

  6. నాగరాజా

    మీరు వ్రాసిన ప్రదేశాలు (దాదాపు) అన్నీ తెలుసు కాబట్టి ఊహించుకోవడం సులభం అయ్యంది. అయితే హిందీ పదాలు కొంచెం ఎక్కువ వాడారు అనిపిస్తుంది… “మెడ పైకెత్తి సూస్తె తిరిగే సుక్కలు ఎక్కడియక్కడే ఆగి మా ఆట సూస్తున్నట్టనిపిచ్చింది” అనే వాక్యం నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది.

  7. sanduka

    మిత్రమా

    నీ కథ చాలా బాగుంది. ఇది నీ మొదటి కథ అంటే నమ్మబుద్ది అయిత లేదు. మంచిగ రాసినవు. కథలో ఒక గమ్మత్తయిన మిస్టరీ వున్నది. దానికి కలలో గొడ్డలి విసిరేసుడు తోటి మంచి ముక్తాయింపు వచ్చింది. తెలంగాణ ల యువకులు విదార్థులు నేడు ఎదుర్కొంటున్న పరిస్థితి ఆ మిస్టరీ. ఒకనాటి వుద్యమాలు, విద్యార్థి వుద్యమాలు, సామాజిక రాజకీయ చైతన్యం నేదు కనబడకుండా పోయినా, కొంత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో ముందుకొచ్చినయి. ఆ అంశాన్ని గతాన్ని నాస్టాల్జిక్ గా తడుముతూనే వర్తమానాన్ని చెప్పే నీ ప్రయత్నం బాగుంది. ఫలితంగా ఒక మంచి కథ తయారయింది. అయితే యిట్లాంటి కలలన్నా నీకు యింకా యెక్కువ రావాలి – నువ్వు యింకా మంచి కథలు రాయాలి – అని కోరుకుంటున్నాను. అయితే యింకో విషయం. యీ కథ ప్రారంభం ఒక సినిమా స్క్రీన్ ప్లే లెక్క షురువయింది. అయితే మంచి కాస్టా గావ్రాస్ సినిమా లాగా తయారు కావాలన్నా లేదా ఏ లాటిన్ అమెరికన్ సినిమా లాగానో పట్టు రావాలన్నా నువ్వు మరింతగా రాయాలి, చదవాలి. నీకు నా అభిననందనలు

    మీ నారాయణ స్వామి.

    మిత్రమా, ఏక వచన సంబోధన చేసిననందుకు క్షమించగలవు. తెలంగాణా లో ఆత్మీయంగా అనిపించిన వారితో గానీ ఆత్మీయులతో గాని నువ్వు అనే పిల్చుకోవడం అలవాటు. మీరు అనడం నాకెందుకో కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది.

  8. Raj

    nicely narrated, wish u all the best, keep writing.
    Regards

  9. SAMPATH KUMAR THULASI

    Masthugunnadi thammmeeeeeeeeeee…… Mana thelenganaaaa thalli puriti nopppula badhale kada neeee kalala ganvadda aduroooo, bedurooooo, vatini minchina araaaatam. Neeee aaaaraaatam sallaga undale, andaritla unna araaaataaanni nilavettutaniki oga pandiri gunja lekkkkka nilavadale. Andari araaatam nunchi balamoooo thechchchukovale. Naaa asuntollla araaatalaku balam yiyyaaale. Naaalugu dikkula paaakale. Neee, naaaa, mana andari aaaaraaaatam theeeerale. AAAARAAATA PADE MANISIKI ADURLU, BEDURLU ANYAAAYAM GADAAA THAMMEEEE. GITLA LENI SOTU YERPAAATU JESUKUNDAM. INKA ANUKUNTE MANA SOTANE GAAA YERPAAATU JESUKUNDAM. Neeeku neeee warangal ganavaddadi. Naaakemo vinavaddadi. Naaaaku naaaa kannnyaram ganavaddadi. Neeeku adi vinvade untadi.

  10. Anil Kumar.T

    chala bagundi….mastu rasinav bai…gatlane rastavundu..

  11. Aruna Reddi

    chaala bavundhi , though I am not from Telengana , I liked this very much . praasa veraina manam andaram aa telugu talli biddalame . Especially student agitations , police lotti charge made me to recall my own real life encounters when I was a student leader . NRIs should come forward like you and expresss their intellectual intrinisicate feelings about our mother

     great .. it just touched my heart and literally wept for few seconds , I was writing wiping my tears . andarini vadili desam kaani desamu lo , baasha kaani bhaasha lo matlaadutu , ade bhaasha ni tintu vunna maa laantivariki ..oo manchi ata vidupu . This is not your life man , idi oka bimbamu endari jeevitaalu no choopistundi

  12. వరవరరావు

    ఇందరి అభిప్రాయాలు చదివాక నేను కూడా అదే అంటే ప్రశంసల జల్లులో తడిసిపోతావేమో! భరత్ భూషన్, నారాయణ స్వామి లతో ఏకీభావం ఉంది. Style అలోచించి నిర్ణయించుకో. Magical realism style, కల గనుక బాగుంది. మరో విధంగా దానినే స్వామి స్క్రీన్ ప్లే అన్నాడు. తెలంగాణ కథకుల్లో ఈ style rare. ఈ వేగము రఘోత్తమ్ ‘ జాడ’ కథలో ఉంది. వరంగల్ 1978 నుండి 85 వరకు, హిట్లర్ పారిస్ ను ముట్టడించడానికన్నా ముందటి పారిస్ లాగా వుండేది. ఒక ఫ్రెంచ్ టీచర్ last lesson ను, ‘ The Train‘ సినిమాను తలపించేలా వుండేది. ఆ రోజులను, ఆ glorious resistance ను, నీ తరం రచయితలు లోకానికి చూపాలి. Keep it up!

  13. kumar

    Wonderful naration. Mandi Bazar, Battala Bazar, Badra Kali cheruvu, Padmakshi Gutta, CKM college, Kakatiya Canal, Intejar Gunj Police Station. Public Garden. Students and thier activities in Eighties ……

    Wo Gujar Gaya Jamana Ko Yaad Dilaya
    Wo Kushi Bara Zindagi ka Yaad Dilaya

    Warangal ka Kasam
    Wo din pir Ayegi
    Hum Jung jeethke Dikayenge

  14. Muralidhar Isanaka

    Story is excellently presented and very interesting.The way the language used is superb.Keep writing and make us happy.

  15. Dileep

    Excellent and thought provoking story.

  16. baddam sanjeeva reddy

    chadivanu. difficult ga anipinchindi. warangal lo vunnana ane feeling. kala / katha warangal paristhuthulaku addam pattindi.

  17. hima bindu

    ….chala bagundi…cheyyi tirigina rachayitalaga rasaru
    bindu

  18. Sushama

    Beautifull…
    when i realized that is was written in beloved telengana ‘yaasa’, i read the the whole story aloud. i had to wipe my eyes many times to clear my tears. it has been so long that i heard telegana telugu, i could not help tearing up. i hope to read and hear more of beautifull telengana.
    Sushama

  19. Srinivas Gajula

    Chaala baaga raasarandi. Nenu Bhushan pampichina Telangana Utsav Comittee site choostundaga.. edho ala telvakunda indloki vachina, title baagundhani click chesa.. mundu raasina nalgu linelu manchiganpinchindhi.. Sare mottam chaduvudaamani aapakunda chadivesaa.. OKA KALA ni intha baaga telangana maandalikam lo entha baaga raasarandi.

    Naadi sircilla, karimnagar, naaku appati 80’s rojulu baaga gurthunnayi.. palletoorlo jaanalu entha bayam bayamga brathike vaallamo.. chekati padithe..bayatiki povalante entha bayapadevaallamo.. Veluthureleni cheekati rodla meedha naduchukuntu povalante.. Anjaneya Anjaneya ani manasulo anukuntu…poyevaanni..

    Naaku Warangal tho chaala takkuva anubandham..
    So akkati rojulagurinchi ekkuva teliyadu, kaani dosthulu(REC Waranga students) cheptuvunde…. hanmakonda, warangal poragaalla jeevithaala gurinchi. so daanni ippudu oohinchukunna..

    itlane inka enno enno manchi kalalni,kalpanalni raastaarani anukuntoo…

    Srinivas

  20. sai

    chala bagundi anna…….naku malli wgl gurthukochindi….malli a student life gurthuochindi…
    great keep it up ….

  21. chavakiran

    ఇరవై మంది చెప్పినారు అంటే చాలా బాగున్న ట్టే అని నేను అనుకుంటూ ఉంటాను
    నువ్వు సాదించినావు అన్నా

    ఎప్పుడు మరో కత వ్రాసేది?

  22. Jaya Prakash

    ఇప్పటికైతె ఒక రెండు కతలమీద పని చేస్తున్న., పని ఒత్తిడులతోటి తొందరగ పూర్తి చెయ్యలేకపోతున్న, తప్పకుంట ఒక రెండు వారలల్ల మీ అ6దరితోటి పంచుకుంట.

    PS: ఇరవైమందికి నచ్చింది కాబట్టి మీకు నచ్చాలని లేదు, చదివినంక మీకు నచ్చితే (ఏం నచ్చిందో కూడ చేప్పితే) చాన సంతోషిస్త.

    మల్లో సారి Direct గనో / Indirect గనో encourage చేస్తున్న మీ అందరికీ Thanks Very Much.

  23. chavakiran

    aa iravailO reMDava vaaDini nEnE :)

  24. Jaya Prakash

    :) i didn’t mean it that way., also apologise for overlooking your previous comment.

  25. Sreekanth

    Arey JP
    naaku ee sahithyam adi ilanti pedda pedda matalu avvi theluvadu kani…. nuvvu rasindi chaduvuthunte bagundi. Paina kontha mandi peddollu valla coments lo neeku edo salahalu rasinru .. nee rachana pantha ila vunte baguntadi ani ,
    naaku avvanni theluvadu kani naaku neeku okati cheppali anipisthundira… endante nuvvu mana Telangana students kastala gurunchi kala kannatte, sukala gurunchi kooda oka kala kani rayira..
    sukalu enta ani nuvvu anukuntunnava? entante nuvvu appati badalu rasavu bane vundi chana mandi chadivi badapadutharu inka koddi mandi choosi ayyo itla ayyinda ani achryapotharu..ila ila. so adi oka phase..
    ayithe nuvvu ippudu inka kala elantidi ante ippudu manamu aa kastala nundi ela bayata padgalam mana tharuvatha chaduvukone pillalaku elanti manchi bavishyattu ivagalamu ala annamta. alantidi kooda rasthe choodalani vundi. Please give something positive message to our people.

  26. Giorgia Palmas

    luogo interessante, soddisfare interessante, buon!

  27. Lokeshwar, Hyd

    మూడు కలలు ఒక గొడ్డలి మరొక ప్రశంస
    ఈ జయప్రకాశ్‌ ఎవరో నాకు సరిగ్గా తెల్వదుగని సోయి పత్రిక పుణ్యమా అని తన తొలి కథతోనే ఆ పిల్లగాడు తెలంగాణా కథల ఆకాశంకు రాకెట్‌లాగ ఉరికొచ్చిండు. చాలా కాలం తర్వాత ఒక మంచి కథ చదివిన అనుభూతి మిగిలిపోయింది. కథ ఎత్తుగడ, ముగింపు, కథ నడిచిన పద్దతి ‘రొటీన్‌’ను బద్దలు కొట్టింది. వరంగల్‌ మాండలికాన్ని ఉర్దూభాషతో మేళవించి తెలంగాణా కాకటైల్‌ను సృష్టించినాడు. శబ్బాష్‌ జయప్రకాశ్‌ శబ్బాష్‌.
    కథ చదివినంతసేపూ అసాంతం కండ్లల్ల కన్నీళ్లు గిర్రున తిరిగినై. ఎందుకో నాకు తెల్వదు. తెల్సినా మీకు చెప్పను ఆ కథను మీరే చదివి మీరే ఏడవండి మనసారా.
    అయ్యో! ఎట్లుండే వొరంగల్‌ ఎట్లయిపోయింది. రాజ్యాన్ని ప్రశ్నించి ధిక్కరించినందుకు ఎంత మంది గిరీష్‌లు రోడ్ల పక్కన శవాలై తేలిండ్రు. ఖాజీపేటల రైలు దిగి భూమ్మీద కాలు పెట్టంగనే కాళ్లల్ల అండర్‌ కరెంట్‌ ప్రవేశించే రోజులు గదా అవి. రాలిపోయిన వారు రాలిపోయినంక, కూలిపోయిన వారు కూలి పోయినంక హితులు, సన్నిహితులు వరంగల్‌ను ఇడిచి కాందీశీకుల్లాగ దేశాలమీదికి ప్రవాసం బోయిండ్రు కదా! ఇగ ఇక్కడేముందని ప్రాణం చివుక్కుమన్నపుడు కొండంత అండ కాళోజీ ఉన్నడు కదా అనుకుని నక్కల గుట్టలనే బస్సుదిగి ఆయనను కల్సుకుని స్వాంతన పొందెటోళ్లం. ఆ తర్వాత ఆ ఆసరా కూడా దూరమాయె. జనార్థన్‌ పాయె కాళోజీ పాయె. ఇగ అంతా శూన్యమే కదా! ఇక ఎవర్నీ కలువాలె? ఉన్న ఒకే ఒక్కడు బుర్ర రాములన్నను కల్సి ఎట్లున్నవన్న బాగున్నవా? అని గొంతు గురగురలతోని పరామర్శిస్తే ”వొరంగల్‌ వాళ్లని బాగున్నరా అని అడుగకండ్రి ఇంకా బ్రతికున్నరా అని అడుగండ్రి” అని ఆయన నిష్ఠూర నిజాన్ని ఇంట్లోడుతడాయె. ఇగ ఏముంది వొరంగల్ల. ఎట్లుండే వొరంగల్‌ ఎట్లయిపాయె. అన్నట్లు తమ్మీ జయప్రకాశ్‌ ఇరానీ చా, సమోసా, మిర్చీలని రాసినవ్‌ గని హన్మకొండ చౌరస్తాల ‘కోహినూర్‌’ హోటల్‌ కదా అది. ఆ ఒక్క మాటంటే నా తభియత్‌ ఇంకా ఖుష్‌ అయ్యెడ్డిగదా!
    అరె భై జై ప్రకాష్‌ వొరంగల్‌ ఆత్మను పట్టుకొని దాని గోసను చెప్పేకథను రాసినవ్‌. వీలుంటే వివరంగా ఒక నవలను అదీ వొరంగల్‌ మీదనే రాయవా? ప్లీజ్‌.
    చున్‌ చున్‌ కే ఇంత మంచి కథను వేసిన సోయి పత్రికకు ( http://soyi.discover-telangana.org ) హృదయపూర్వక అభినందనలు.
    – లేకేశ్వర్‌ హైదరాబాదీ

  28. Sasy

    kala adi???
    ………..nijamga nijame anukunna !

    konni chotla nee basha arthamkale….malli malli chadiva….chala chala bagundi……….ilantivi malli malli rastundu……….nee lo ilanti talent undani…just ippude naaku telsindi……….emailna nuvvu something different ………..excellent..

  29. Siddartha Pamulaparty

    Hello JP garu,

    It was a great story and chaala realistic gaa unnadi mee kala.
    Maa illu Mattwada la ne untadi, so mee story la mana battala bazaar, pinnavari veedhi, a v v college, naaku malli Warangal yaadikochchindi. Nenu ikkada US la pani meeda unna, struggling to get back to home asap.

    Chinnappudu 5th class chaduvutunnappudu, nenu maa friends inko iddaru kalisi Bhadrakali temple venakala nunchi, via chakalivaada Padmakshamma guttaku naduchukuntoo poyinaamu. Appudu ado pedda adventure laaga unde, intlo vallu kuda koddisepu pareshaan ayindru.

    Thanks for the story.
    Regards,
    Siddartha.

  30. Siddartha Pamulaparty

    by the way, mee baasha perfectgundi, naakaithe masthu nacchindi.

  31. JayaPrakash Telangana

    :) Thanks Siddhartha, aa vaadalalla perigi aa adventures cheyyani warangal vallu untey there’s somethign they really missed in their childhood. especially bhadrakali / fort warangal / gvindarajula guttaa., they seemed very intriguing when we’re kids & dare us to get on that adventures., so that we can look back into the memory lane now and cherish.

    i guess may be all that came out from my sub concious as this story.

    FYI: i got a chance to shoot a short film based on this story, entrely shot in warangal in Jan 2008, planning to release it some time by end of this year. keep watching this space for more details.

Leave a comment